Sundaram Master OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘సుందరం మాస్టర్’.. ఎక్కడ చూడొచ్చంటే..

అటు సినిమాలు.. ఇటు వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటున్నాడు. ఇప్పుడు ఆయన హీరోగా తెరకెక్కిన సినిమా సుందరం మాస్టర్. ఫిబ్రవరి 23న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. మాస్ మాహారాజా రవితేజ నిర్మించిన ఈ మూవీ మంచి వసూళ్లు రాబట్టింది. ట్రైలర్, టీజర్ తో ఆసక్తిని కలిగించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక మరోసారి తన కామెడీ యాక్టింగ్ తో మెప్పించాడు హర్ష. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

Sundaram Master OTT: ఓటీటీలోకి వచ్చేసిన 'సుందరం మాస్టర్'.. ఎక్కడ చూడొచ్చంటే..
Sundaram Master
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 28, 2024 | 10:21 AM

షార్ట్ ఫిల్మ్ ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు వైవా హర్ష అలియాస్ హర్ష చెముడు. సినిమాల్లో తనదైన నటనతో కామెడీని పంచుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అటు సినిమాలు.. ఇటు వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటున్నాడు. ఇప్పుడు ఆయన హీరోగా తెరకెక్కిన సినిమా సుందరం మాస్టర్. ఫిబ్రవరి 23న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. మాస్ మాహారాజా రవితేజ నిర్మించిన ఈ మూవీ మంచి వసూళ్లు రాబట్టింది. ట్రైలర్, టీజర్ తో ఆసక్తిని కలిగించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక మరోసారి తన కామెడీ యాక్టింగ్ తో మెప్పించాడు హర్ష. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. మార్చి 28 నుంచి ఈ సినిమా ఆహా వేదికపై అందుబాటులోకి వచ్చింది. “మాస్టారు.. మాస్టారు..మీ మనసులను గెలవడానికి వచ్చేశారు” అంటూ ఆహా ట్వీట్ చేసింది.

థియేటర్లలో విడుదలైన దాదాపు నెల రోజులకు ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇన్నాళ్లు బాక్సాఫీస్ వద్ద ఈ కామెడీ ఎంటర్టైనర్ ను మిస్ అయినవారు ఇప్పుడు నేరుగా ఇంట్లోనే ఈ సినిమాను చూసేయ్యోచ్చు. వైవా హర్ష హీరోగా నటించిన ఈ సినిమాకు కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. ఇందులో దివ్య శ్రీపాద, హర్షవర్దన్, బాలకృష్ణ నీలకంఠపు, భద్రం కీలకపాత్రలు పోషించారు. ఆర్టీ టీమ్ వర్క్స్, గోల్డెన్ మీడియా బ్యానర్స్ పై రవితేజ, సుధీర్ కుమార్ నిర్మించారు.

కథ విషయానికి వస్తే.. అడవి ప్రాంతంలో ఉన్న ఓ మారుమూల గ్రామస్తులు తమకు ఇంగ్లీష్ టీచర్ కావాలని అక్కడి ఎమ్మేల్యేకు విజ్ఞప్తి చేస్తారు. దీంతో సుందరం మాస్టర్ (వైవా హర్ష)ను ఆ ఊరికి ఇంగ్లీష్ టీచర్ గా పంపిస్తాడు ఆ ఎమ్మేల్యే. కానీ అక్కడున్న గ్రామస్తులు మాత్రం అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ.. సుందరం మాస్టర్ ను ఓ ఆటాడుకుంటారు. ఆకస్మాత్తుగా ఓరోజు సుందరం మాస్టర్ కు పరీక్ష పెడతారు ఆ ఊరి ప్రజలు. చివరకు ఆ పరీక్షలో సుందరం మాస్టర్ గెలిచాడా ?.. ఇంతకీ ఆ ఊరి ప్రజలు సుందరం మాస్టర్ ను ఏం చేశారు ?.. వారంతా ఇంగ్లీష్ ఎలా మాట్లాడారు ?.. అనే విషయాలను తెలుసుకోవాలంటే సుందరం మాస్టర్ చూడాల్సిందే. ఇప్పుడు ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు