IPL 2024: ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ.. రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం

మొదట గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయిన హార్దిక్ సేన బుధవారం (మార్చి 27) సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో కూడా ఘోరంగా ఓడిపోయింది. అసలే ఓటమి బాధలో ఉన్న ముంబై ఇండియన్స్ కు ఒక చేదు వార్త. ఆ జట్టు స్టార్ ప్లేయర్..

IPL 2024: ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ.. రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ఇక వారిలో పొలార్డ్ ప్రస్తుతం ముంబై ఫ్రాంచైజీకి వన్ ఆఫ్ ది కోచ్ కాగా.. అతడి స్థానంలో కచ్చితంగా ఈసారి హార్దిక్ పాండ్యాను రిటైన్ చేసుకోనుంది ముంబై యాజమాన్యం.
Follow us
Basha Shek

|

Updated on: Mar 28, 2024 | 9:27 PM

ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ గెలిచింది, అయితే 17వ సీజన్‌లో వారి పరిస్థితి దారుణంగా కనిపిస్తోంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ముంబై జట్టు ఓడిపోయింది.మొదట గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయిన హార్దిక్ సేన బుధవారం (మార్చి 27) సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో కూడా ఘోరంగా ఓడిపోయింది. అసలే ఓటమి బాధలో ఉన్న ముంబై ఇండియన్స్ కు ఒక చేదు వార్త. ఆ జట్టు స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ మరిన్ని మ్యాచ్‌లలో ఆడలేకపోవచ్చునని వార్తలు వస్తున్నాయి. ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌ సూర్యకుమార్ యాదవ్‌కు స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ జరిగింది. అతను ఇప్పటి వరకు పూర్తిగా కోలుకోలేకపోయాడు. ఈ ఆటగాడు NCS నుండి ఆడటానికి అనుమతి పొందలేదు. అందుకే అతను రాబోయే కొన్ని IPL మ్యాచ్‌లకు దూరంగా ఉంటాడు. సూర్య పూర్తి ఫిట్ నెస్ సాధించడానికి మరికొంత సమయం పట్టనుందని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో ఈ స్టార్ ప్లేయర్ ఫిట్ నెస్ విషయంలో బీసీసీఐ ఎలాంటి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. ఎందుకంటే IPL తర్వాత ప్రతిష్ఠాత్మక T20 ప్రపంచ కప్ సూర్య కుమార్ కచ్చితంగా ఆడాలి. జూన్ లో వెస్టిండీస్, అమెరికాలో జరిగే ఈ మేజర్ క్రికెట్ టోర్నీలో సూర్య చాలా కీలకం.

సూర్యకుమార్ యాదవ్ తప్పుకోవడంతో ముంబై జట్టు పంజాబ్ కు చెందిన డ్యాషింగ్ బ్యాటర్‌ నమన్ ధీర్ కు అవకాశం కల్పిస్తోంది. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. నమన్ ఇప్పటివరకు 50 పరుగులు మాత్రమే చేశాడు కానీ ఈ ఆటగాడి బ్యాటింగ్, హిట్టింగ్ రెండూ అద్భుతంగా కనిపిస్తున్నాయి. అయితే ఏం జరిగినా ఈ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ లేని తీర్చలేడు. అటువంటి పరిస్థితిలో, ముంబై జట్టు సూర్యకుమార్ వీలైనంత త్వరగా తిరిగి రావాలని కోరుకుంటుంది. ముంబై ఇండియన్స్ జట్టు తన తదుపరి మ్యాచ్ ను రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది. సోమవారం (ఏప్రిల్1) ముంబై వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..