IPL 2024: CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్..ధోని, కోహ్లీల ఆటను ఎన్ని కోట్ల మంది చూశారంటే?

IPL 17వ సీజన్ మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య మ్యాచ్‌తో ప్రారంభమైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ ఓపెనింగ్ మ్యాచ్ ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది.

IPL 2024: CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్..ధోని, కోహ్లీల ఆటను ఎన్ని కోట్ల మంది చూశారంటే?
Chennai Super Kings vs Royal Challengers Bengaluru
Follow us

|

Updated on: Mar 28, 2024 | 8:48 PM

ఐపీఎల్ 2024 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ధనాధన్ క్రికెట్ టోర్నీ ప్రారంభమై అప్పుడే వారం గడిచింది. మ్యాచ్‌కి మ్యాచ్‌కి ఉత్కంఠ పెరుగుతుండడంతో అభిమానులకు వినోదం అందుతోంది. IPL 17వ సీజన్ మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య మ్యాచ్‌తో ప్రారంభమైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ ఓపెనింగ్ మ్యాచ్ ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ అధికారిక స్ట్రీమింగ్‌ సంస్థ డిస్నీ స్టార్ తెలిపిన వివరాల ప్రకారం తొలిరోజు మొత్తం 16.8 కోట్ల మంది మ్యాచ్ వీక్షించారు. ఐపీఎల్ చరిత్రలోనే ఇదొక సరికొత్త రికార్డు. డిస్నీ స్టార్ ప్రకారం, మొదటి రోజు స్ట్రీమింగ్ టైమ్‌ మొత్తం 1276 కోట్ల నిమిషాలు. అలాగే IPL 17వ సీజన్ మొదటి రోజు డిస్నీ స్టార్ నెట్‌వర్క్‌లో 6.1 కోట్ల మంది వీక్షకులు ఏకకాలంలో మ్యాచ్‌ను వీక్షించారు. ఇది కూడా ఒక రికార్డే. గతేడాది అంటే 2023 ఐపీఎల్‌ ప్రారంభ మ్యాచ్‌ని 870 కోట్ల నిమిషాలు వీక్షించారు. గత ఎడిషన్‌తో పోలిస్తే, టీవీ వినియోగంలో 16 శాతం వృద్ధి నమోదైందని బ్రాడ్‌కాస్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే, లీగ్ ప్రారంభానికి వారం రోజుల ముందు ప్రసారమైన ప్రీ-టోర్నమెంట్ ప్రోగ్రామ్‌ల సిరీస్‌ను 24.5 కోట్ల మంది వీక్షించినట్లు సమాచారం.

లైవ్ స్ట్రీమింగ్ హక్కు కలిగిన జియో సినిమా యాప్‌లో తొలిరోజు 11.3 కోట్ల మంది వీక్షకులు మ్యాచ్‌ను వీక్షించడం కూడా ఓ రికార్డు. గత ఎడిషన్లతో పోలిస్తే ఈసారి మ్యాచ్‌కి తొలిరోజు వీక్షకుల సంఖ్య 51 శాతం పెరిగింది. జియో సినిమా కూడా మొదటి రోజు 660 కోట్ల నిమిషాల వీక్షణలను నమోదు చేసింది. ఐపీఎల్ 17వ ఎడిషన్ మొదటి వారం ప్రేక్షకులకు విపరీతమైన వినోదాన్ని అందించింది. సీజన్‌లో తొలి డబుల్‌హెడర్‌గా నిలిచిన టోర్నీ రెండో రోజున, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ 15 నెలల తర్వాత తిరిగి మైదానంలోకి వచ్చాడు. దీంతో ఐపీఎల్ వీక్షకుల మరింత సంఖ్య పెరిగింది. దీంతో పాటు టోర్నీ ఎనిమిదో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరును నమోదు చేసింది, ఈ మ్యాచ్‌లో చాలా పెద్ద రికార్డులను బద్దలు కొట్టింది. దీంతో ఐపీఎల్‌కు మంచి ఆదరణ కూడా వచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి