RR vs DC, IPL 2024: ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు

గురువారం (మార్చి 28) రాత్రి ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రియాన్‌ పరాగ్‌ (84: 45 బంతుల్లో) ఆకాశమే హద్దుగా చెలరేగాడు

RR vs DC, IPL 2024: ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
Rajasthan Royals vs Delhi Capitals
Follow us
Basha Shek

|

Updated on: Mar 29, 2024 | 12:10 AM

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్ వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. అదే సమయంలో రిషబ్ పంత్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో పరాజయాన్ని చవి చూసింది. గురువారం (మార్చి 28) రాత్రి ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రియాన్‌ పరాగ్‌ (84: 45 బంతుల్లో) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అనంతరం ఛేదనకు దిగిన డిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు మాత్రమే చేసింది. డేవిడ్‌ వార్నర్‌ (49), స్టబ్స్‌ (44*) ఆడినా మిగతా బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో ఢిల్లీకి వరుసగా రెండో ఓటమి తప్పలేదు.  ఛేదనలో ఢిల్లీ విజయానికి 20వ ఓవర్‌లో 17 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ జంటగా ఆడుతున్నారు. ఢిల్లీ తరఫున అవేశ్ ఖాన్ 20 ఓవర్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు.  కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి రాజస్థాన్‌కు విజయాన్ని అందించాడు. ఢిల్లీ తరఫున డేవిడ్ వార్నర్ 49, మిచెల్ మార్ష్ 23, రికీ భుయ్ 0, కెప్టెన్ రిషబ్ పంత్ 28, ట్రిస్టన్ స్టబ్స్ 44*, అభిషేక్ పోరెల్ 9, అక్షర్ పటేల్ 15 పరుగులు చేశారు. రాజస్థాన్‌లో నాంద్రే బెర్గర్, యుజ్వేంద్ర చాహల్ చెరో 2 వికెట్లు తీశారు. అవేష్ ఖాన్ 1 వికెట్ తీశాడు.

అంతకు ముందు ఢిల్లీ టాస్ గెలిచి రాజస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆదేశించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రాజస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రాజస్థాన్ తరఫున రియాన్ పరాగ్ 84 పరుగులతో టాప్ స్కోర్ చేశాడు. రియాన్ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. యశస్వి జైస్వాల్ 5, జోస్ బట్లర్ 11, కెప్టెన్ సంజు శాంసన్ 15, ఆర్ అశ్విన్ 29, ధ్రువ్ జురెల్ 20, షిమ్రోన్ హెట్మెయర్ 14* కూడా స్కోరు చేశారు. ఢిల్లీ నుంచి ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, ఎన్రిచ్ నార్త్జే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.

అవేశ్ ఖాన్ అద్భుత బౌలింగ్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..