RR vs DC, IPL 2024: 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ తొమ్మిదో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు 186 పరుగుల విజయలక్ష్యాన్ని అందించింది. రాజస్థాన్ తరఫున రియాన్ పరాగ్ మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. కేవలం 45 బంతుల్లోనే 84 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. రియాన్ మెరుపు ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 6 భారీ సిక్సర్లు ఉన్నాయి

RR vs DC, IPL 2024: 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
Riyan Parag
Follow us
Basha Shek

|

Updated on: Mar 28, 2024 | 10:11 PM

ఐపీఎల్ తొమ్మిదో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు 186 పరుగుల విజయలక్ష్యాన్ని అందించింది. రాజస్థాన్ తరఫున రియాన్ పరాగ్ మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. కేవలం 45 బంతుల్లోనే 84 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. రియాన్ మెరుపు ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 6 భారీ సిక్సర్లు ఉన్నాయి. అయితే మిగతా బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఇప్పుడు రాజస్థాన్ బౌలర్లు ఈ స్కోరును కాపాడుకుంటారా? లేదా ఢిల్లీకి మొదటి విజయం లభిస్తుందా, క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఢిల్లీ ఇన్నింగ్స్‌లో రియాన్ పరాగ్ హైలెట్ గా నిలిచాడు.   ఢిల్లీ బౌలర్లను చిత్తు చేస్తూ ఫోర్లు, సిక్సర్లు బాదాడు.  కేవలం 45 బంతుల్లో 6 సిక్సర్లు, 7 ఫోర్లతో 186.67 స్ట్రైక్ రేట్‌తో అజేయంగా 84 పరుగులు చేశాడుపరాగ్. అతను చేసిన 84 పరుగుల కారణంగానే రాజస్థాన్ 185 పరుగులకు చేరుకోగలిగింది. అంతే కాదు, రాజస్థాన్‌కు నాలుగో, ఐదో, ఆరో వికెట్ భాగస్వామ్యాల్లో రియాన్ చాలా సహకరించాడు.

ఇవి కూడా చదవండి

రియాన్, ఆర్ అశ్విన్ నాలుగో వికెట్‌కు 39 బంతుల్లో 54 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ భాగస్వామ్యంలో పరాగ్ 22 పరుగులు చేశాడు. అలాగే ధ్రువ్ జురెల్ తో కలిసి ఐదో వికెట్‌కు 23 బంతుల్లో 52 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ భాగస్వామ్యంలో రియాన్ 11 బంతుల్లో 32 పరుగులు చేయడం విశేషం. ఇక ఆరో వికెట్‌కు షిమ్రాన్ హెట్‌మెయర్‌తో కలిసి 17 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ఇందులో పరాగ్ కేవలం 9 బంతుల్లో 23 పరుగులు చేయడం విశేషం.

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI: రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రికీ భుయ్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఎన్రిక్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్.   ముఖేష్ కుమార్.

రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ ఎలెవన్: సంజు శాంసన్ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, ర్యాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..