Viral Video: మొబైల్ మాయలో పడిన ఓ తల్లి చేసిన నిర్వాకం.. కొంచెం కూడా సోయి లేకుండా
మొబైల్ అడిక్షన్ అనేది ఎంతో డేంజరేస్ అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే మంచిది. మొబైల్ చేతిలో ఉంటే చాలు.. ఒంటి మీద ఉన్న బట్టలు ఎత్తుకెళ్లినా సోయి లేకుండా ఉంటున్నారు కొందరు. అలాంటివారు అందరూ ఈ వీడియో చూడండి.. ఫోన్ అడిక్షన్ ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి....
ఇప్పుడు ఫోన్ లేకపోతే గంట కూడా గడవదు.. ఒకప్పుడు అవసరం అనిపించిన ఫోన్.. ఇప్పుడు నిత్యావసరం అయిపోయింది. రీల్స్ పిచ్చిలో పడిపోయి చాలామంది ఫోన్‌కు అడిక్ట్ అయిపోయారు. పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకోవడం లేదు. అలా పరధ్యానంలో పడిపోయి ప్రాణాలు పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇంకొందరు అయితే ఫోన్‌లో గేమ్ ఆడుతూ ప్రపంచాన్ని మర్చిపోతున్నారు. ఆ గేమ్ పిచ్చిలో పడి బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు. ఇవన్నీ అనర్థాలకు దారితీసేవే. అయితే చంటి బిడ్డలు ఉన్న తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలి. పిల్లలకు ఎటు వెళ్తే, ఏది ముట్టుకుంటే ప్రమాదమో తెలీదు. వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. మీరు ఫోన్ పరధ్యానంలో పడిపోయి.. పిల్లలను పట్టించుకోకపోతే.. పెను ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంటుంది. అందుకు అద్దం పట్టే వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
వీడియోని గమనిస్తే.. ఓ ఇంట్లోని హాల్లో తల్లి, చిన్న బాబు ఉంటారు. పిల్లాడు హాల్‌లో బొమ్మలతో ఆడుకుంటూ ఉండగా.. ఆ తల్లికి ఫోన్ వస్తుంది. ఆమె ఫోన్ మాట్లాడుతూ.. వంట కోసం కూరగాయలు తరగడం వంటి పనులూ చేస్తూ ఉంటుంది. సరిపోయినన్ని కూరగాయలు కట్ చేసి.. మిగిలినవాటిని రిఫ్రిజిరేటర్‌లో పెట్టాలనుకుంటుంది. అయితే.. ఫోన్ మాట్లాడుతూ పరధ్యానంలో ఉన్న ఆమె.. ఫ్రిడ్జ్‌లో కూరగాయలకు బదులు, పిల్లాన్ని కూర్చోబెట్టి డోర్ వేస్తుంది. ఆ తర్వాత కాసేపటి.. ఆమె భర్త లోపల రూమ్ నుంచి హాల్ లోకి వస్తాడు. బాబు కనిపించకపోయే సరికి ఎక్కడ అని అడుగుతాడు. ఇల్లంతా వెతికినా కనిపించడు. అదే సమయంలో.. ఆ పిల్లాడి ఏడుపు సన్నగా వినిపిస్తుంటుంది. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందా అని చూసిన ఆ తండ్రి.. ఫ్రిడ్జ్ నుంచి వస్తున్నట్టు గుర్తించి.. డోర్ తెరిచి చూడగా.. అందులో పిల్లాడు కనిపిస్తాడు. ఇంతటి ఘనకార్యం చేసిన తల్లికి అక్షింతలు వేస్తాడు.
Horrible Addiction 😰 pic.twitter.com/D3Pl0a4rsv
— Prof cheems ॐ (@Prof_Cheems) March 30, 2024
మొబైల్ మాయలో పడిపోయిన తల్లి.. ఏం చేస్తుందో కూడా అర్థం కాకుండా పిల్లాడి పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంది అన్నది కళ్లకు కట్టినట్టు ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది. అయితే ఇది నిజమైన వీడియో కాదు. ప్రస్తుత కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది చూపించి.. జనాల్లో అవగాహన కోసం చేసిన ఓ ప్రయత్నం. చంటి బిడ్డలు ఉన్న తల్లులూ.. ఈ వీడియో చూశాక అయినా భద్రం తల్లీ…!
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…