Viral: ఈడో హారతి కర్పూరం.. ఆణిముత్యం.. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌కి మధ్య తేడా ఇదంట..
ప్రశ్నపత్రంలో అడిగిన ప్రశ్నకు సదరు విద్యార్థి ఇచ్చిన సమాధానం చూస్తే మీరు కంగుతినాల్సిందే. ఇతను కదా అసలైన జాతిరత్నం అంటున్నారు నెటిజన్స్. హార్డ్‌వేర్‌కి, సాఫ్ట్‌వేర్‌కి డిఫరెన్స్ ఏంటో తన స్టైల్లో రాసుకొచ్చాడు ఈ క్రియేటివ్ స్టూడెంట్. అదెంటో తెలుసుకుందాం పదండి...
ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మనకు కనిపించేది మీమ్స్ మాత్రమే. నెట్టింట భలే ఫన్నీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. నిజంగా వీటిని క్రియేట్ చేసే వాళ్ల తెలివిని మెచ్చుకోవాలి. ఇక వీళ్లు రోస్ట్ చేయడంలోనూ ముందే ఉంటారు. వాళ్లని.. వీళ్లని అని ఏం లేదు. ఏ స్థాయివారినైనా రఫ్ఫాడించేస్తున్నారు. కొందరు మరీ హద్దుమీరుతున్నారు. అలాంటివారికి చిక్కులు తప్పువు అనుకోండి. ఇక మరీ ఫన్నీ థింగ్ ఏంటి అంటే.. ఎగ్జామ్స్‌లో స్టూడెంట్స్ రాసిన ఫన్నీ ఆన్సర్స్. ఇచ్చిన ప్రశ్నకు ఆన్సర్ తెలియక.. అలా అని ఏం రాయకుండా ఉండలేక.. చిత్రవిచిత్రమైన సమాధానాలు రాస్తారు కొందరు. ప్రశ్నాపత్రాలు దిద్దేటప్పుడు వాటిని చూసిన టీచర్స్ స్టన్ అవుతూ ఉంటారు.
తాజాగా అలానే ఓ జాతిరత్నం రాసిన ఆన్సర్‌ను మీ ముందుకు తీసుకొచ్చాం. ఇతగాడు మాములు ఆణిముత్యం కాదండోయ్. హార్డ్‌వేర్‌కి, సాఫ్ట్‌వేర్‌కి తేడా ఏంటి అని అడగ్గా.. దిమాక్ ఖరాబ్ అయ్యే ఆన్సర్ రాశాడు. ఆ ఆన్సర్ చూసిన టీచర్‌కు మైండ్ బ్లాంక్ అయినంత పనైంది. హార్డ్‌వేర్ ఏమో హార్డ్ అట.. సాఫ్ట్‌వేర్ ఏమో సాఫ్ట్ అట. హార్డ్‌వేర్ అనేది విభిన్నమైనది అట.. సాఫ్ట్‌వేర్ కూడా డిఫరెంట్ అట. హార్డ్‌వేర్ అనేది సాఫ్ట్ కాదట.. అలానే సాఫ్ట్‌వేర్ అనేది హార్డ్ కాదంట. ఇలా తనకు తోచిన తింగరి సమాధానంతో పేపర్ నింపేశాడు. కొన్ని సార్లు టీచర్లు పేపర్లు దిద్దేటప్పుడు ఓవర్ లుక్‌లో తప్పు రాసినా మార్క్స్ వేసేస్తూ ఉంటారు. అలా భావించి ఏదో పాస్ మార్క్స్ కొట్టేద్దామనుకున్నాడు ఈ ఆణిముత్యం. కానీ అడ్డంగా బుక్కయ్యాడు. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫన్నీ ఆన్సర్స్ రాశారా..? రాస్తే మాకు తెలియజేయండి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…