AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆఫీసుల్లో వ్యవసాయం చేస్తున్న సంస్థలు.. ఇప్పుడు ఇదే ట్రెండ్

వ్యవసాయం.. ఈ పేరు వినగానే పచ్చని పంట పొలాలు, బోరులు, బావులు ఇలా చాలానే గుర్తుకువస్తాయి. బిజీ లైఫ్‎లో కనీసం వారానికి ఒకసారైనా అలా పొలాల వద్దకు వెళ్లి సేద తీరాలని అనుకుంటాం. మంచి సాగు చేయడానికి ల్యాండ్ అవసరం. కానీ అలాంటి స్థలం అవసరం లేకుండా టెర్రస్ పైనే కూరగాయలు, మన ఇంటికి కావాల్సిన అకు కూరలు పండించే వాళ్ళని మనం చూశాం.

ఆఫీసుల్లో వ్యవసాయం చేస్తున్న సంస్థలు.. ఇప్పుడు ఇదే ట్రెండ్
Urban Elevated Farming
Yellender Reddy Ramasagram
| Edited By: Srikar T|

Updated on: Mar 31, 2024 | 4:30 PM

Share

వ్యవసాయం.. ఈ పేరు వినగానే పచ్చని పంట పొలాలు, బోరులు, బావులు ఇలా చాలానే గుర్తుకువస్తాయి. బిజీ లైఫ్‎లో కనీసం వారానికి ఒకసారైనా అలా పొలాల వద్దకు వెళ్లి సేద తీరాలని అనుకుంటాం. మంచి సాగు చేయడానికి ల్యాండ్ అవసరం. కానీ అలాంటి స్థలం అవసరం లేకుండా టెర్రస్ పైనే కూరగాయలు, మన ఇంటికి కావాల్సిన అకు కూరలు పండించే వాళ్ళని మనం చూశాం. కానీ ఇవి కాకుండా మరో రకం కొత్త సాగు ఇప్పుడు ట్రెండింగ్‎లో కి వచ్చిందండోయ్. ఆ డిటైల్స్ ఇప్పుడు చూద్దాం.

పొలంలో రకరకాల పంటలు పండించుకోవడం అందరికీ తెలుసు. ఈమధ్య పెరట్లోనూ,టెర్రస్ మీద కూడా పండిస్తున్నారు. కానీ వీటన్నిటికీ డిఫరెంట్‎గా సిటీలో చేస్తున్న కొత్తరకం సాగు గురించి మీకు తెలుసా? అర్బన్ ఎలివేటెడ్ ఫామింగ్. ఈ అర్బన్ ఎలివేటెడ్ ఫామింగ్‎లో ప్లేస్ చాలా విలువైనది. ప్రతి అడుగుని ఇక్కడ పూర్తిగా ఉపయోగించుకోవాలి. అర్బన్ ఎలివేటెడ్ ఫామింగ్‎ ఆఫీసుల్లో క్యాబిన్ లోని గదుల మధ్య ఉండే ఖాళీ ప్లేస్ లేక పార్టీషియన్స్‎లలో వర్టికల్ ఫార్మింగ్ పద్ధతిలో మొక్కల్ని ఏర్పాటు చేస్తున్నారు. హైడ్రోపోనిక్స్, ఏరోపోనిక్స్ పద్ధతుల్లో లేటెస్ట్‎గా పనిచేసే సెన్సార్లతో, ఎల్ఈడి లైట్లతో వెలుతురుని, ఉష్ణోగ్రతల్ని, కంట్రోల్ చేస్తూ తక్కువ నీటితో రకరకాల కూరగాయల్ని, ఆకుకూరలని పండిస్తారు. ఒకటే పనిగా ఆఫీసుల్లో సిస్టం ముందు కూర్చుని స్క్రీన్‎ని చూస్తూ పనిచేసే వారికి.. ఎదురుగా ఉన్న ఈ పచ్చటి మొక్కల్ని చూడడం కూడా రిలీఫ్‎గా ఉంటుంది. వాటి సాగు విషయంలో ఇన్వాల్వ్ అవ్వచ్చని, ఎలాంటి ఫెస్టిసైడ్స్, రసాయనాలు ఉపయోగించకుండా శుభ్రమైన కాయగూరల్ని ఇంటికి కూడా తీసుకెళ్ల ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇన్ని రకాల లాభాలు ఉన్నప్పుడు ఎవరు మాత్రం వ్యాపార అవకాశాల్ని వదులుకుంటారు. చాలా దేశాల్లో ప్రముఖంగా ఉన్న కంపెనీల్లో ఖాళీ స్థలాలని కొన్ని కంపెనీలు లీజుకు తీసుకుంటున్నాయి. ఈ పనిలో దేశీయ అంతర్జాతీయ కంపెనీలు నిమగ్నమయ్యాయి.

ఆరోగ్యం పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తికి ఈ ఆలోచన తోడై.. చాలా సిటీస్‎లో ఎందరికో ఉపాధి చూపిస్తుంది. ఇంటి బాల్కనీలో, ఇంట్లోనే ఒక గదినీ అందుకు కేటాయించి చాలామంది డబ్బు సంపాదిస్తున్నారు కూడా. లేలేత మొక్కలు మట్టి అక్కర్లేకుండా నీటిలోనూ, లేదా కోకోపీట్‎ని ఉపయోగించి వెడల్పైన ట్రే లాంటి వాటిల్లో పెంచే చిన్న చిన్న మొక్కలు.. బ్రొకలి, కేల్, ముల్లంగి, సన్ ఫ్లవర్, బఠానీ, కొత్తిమీర లాంటి వాటిని ఇలా మొలకెత్తించవచ్చు. కొద్ది రోజుల్లోనే మొలకెత్తిన పలు విటమిన్లు ఖనిజాలతో పోషకాల ఘనులుగా మారుతాయి. తెగుళ్ల బెడద ఉండదు. నాణ్యమైన విత్తనాలతో నాటి.. గాలి, వెలుతురు తగినంత ఉండేలా చూసుకుంటే చాలు. ఒకవేళ ఇంట్లోకి సరిపోయేంత వెలుతురు రాదనుకుంటే ఎల్ఈడి లైట్లని వాడుకోవచ్చు. పెద్ద ఖర్చు, శ్రమ అవసరం లేదు. ఇలాంటి మైక్రో గ్రీన్స్ పెంపకానికి కావలసిన సెట్స్‎ను ఆన్లైన్లో కొన్ని కంపెనీలు అమ్ముతున్నాయి. సో మీరు కూడా ఇలాంటివి ట్రై చేసి సంపాదనతోపాటు ఆరోగ్యం పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..