- Telugu News Photo Gallery Health Tips: What Are The Benefits Of Eating Tulsi Daily, Know All Details
Tulsi Benefits: రోజూ ఈ మొక్క ఆకులు నాలుగైదు నోట్లో వేసుకుంటే ఏ రోగం దరిచేరదు..
తులసి దాదాపు ప్రతి ఇంట్లో కనిపించే మొక్క. చాలా సులభంగా పెరుగుతుంది. ఈ చిన్న మొక్క శరీరం నుంచి ఎన్నో వ్యాధులను దూరం చేస్తుంది. ఇంట్లో తులసి చెట్టు తప్పకుండా పెంచుకోవాలని మన పూర్వికుల కాలం నుంచి పెద్దలు చెబుతుంటారు. ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు నిండి ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా దీనికి అధిక ప్రాముఖ్యత ఉంది. తులసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది యాంటీఆక్సిడెంట్‌గా ఉండటమే కాకుండా, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను..
Updated on: Mar 31, 2024 | 12:44 PM

తులసి దాదాపు ప్రతి ఇంట్లో కనిపించే మొక్క. చాలా సులభంగా పెరుగుతుంది. ఈ చిన్న మొక్క శరీరం నుంచి ఎన్నో వ్యాధులను దూరం చేస్తుంది. ఇంట్లో తులసి చెట్టు తప్పకుండా పెంచుకోవాలని మన పూర్వికుల కాలం నుంచి పెద్దలు చెబుతుంటారు.

ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు నిండి ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా దీనికి అధిక ప్రాముఖ్యత ఉంది. తులసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది యాంటీఆక్సిడెంట్‌గా ఉండటమే కాకుండా, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఈ అంశాలన్నీ అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

తులసి ఆకులు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఆకు వల్ల కలిగే లాభాలు అన్నీఇన్నీకావు. తులసిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇది జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తులసి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

అంతే కాకుండా ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. తులసి రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి తులసి ఆకులు ప్రభావవంతంగా పనిచేస్తాయి.

ఇది జ్వరం, చర్మం, జుట్టుకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజూ నాలుగైదు తులసి ఆకులను తింటే ఎన్నో రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. అయితే సరైన పద్ధతిలో తింటేనే ఈ ప్రయోజనాలన్నీ పొందవచ్చు. తులసితో టీ కూడా తాగవచ్చు. దీని ఆకులను ఎండబెట్టి, నీటిలో మరిగించి అయినా తాగొచ్చు




