Menstrual Cramps: అందుకే పీరియడ్స్ సమయంలో చిన్న బెల్లం ముక్క తినాలట.. ఎన్ని లాభాలో
చాలా మంది మహిళలు ప్రతి నెలా పీరియడ్స్ టైంలో భరించలేని కడుపు నొప్పిని అనుభవిస్తుంటారు. దీనివల్ల ఆఫీస్‌కు వెళ్లడం కష్టంగా మారుతుంది. కడుపు నొప్పి, తిమ్మిర్లు, ఉబ్బరం కారణంగా ఏమీ తినాలని అనిపించదు. చాలా అసౌకర్యంగా ఉంటుంది. మీకు కూడా ఇలాంటి రోజుల్లో సమస్యలు తలెత్తితే ఈ కింది జాగ్రత్తలు తీసుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పీరియడ్స్ సమయంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం..
చాలా మంది మహిళలు ప్రతి నెలా పీరియడ్స్ టైంలో భరించలేని కడుపు నొప్పిని అనుభవిస్తుంటారు. దీనివల్ల ఆఫీస్‌కు వెళ్లడం కష్టంగా మారుతుంది. కడుపు నొప్పి, తిమ్మిర్లు, ఉబ్బరం కారణంగా ఏమీ తినాలని అనిపించదు. చాలా అసౌకర్యంగా ఉంటుంది. మీకు కూడా ఇలాంటి రోజుల్లో సమస్యలు తలెత్తితే ఈ కింది జాగ్రత్తలు తీసుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పీరియడ్స్ సమయంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఐరన్ అధికంగా ఉండే బెల్లం సర్వరోగనివారిణి
పీరియడ్స్ సమయంలో చిన్న బెల్లం ముక్క తినాలి. ఇది కడుపు నొప్పి నుంచి తక్షణ ఉపశమనం ఇచ్చి, శక్తిని ఇస్తుంది. బెల్లంలో చాలా ఎక్కువ మొత్తంలో ఐరన్ లభిస్తుంది. ఇది తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తిని అందుతుంది. ఇది పీరియడ్స్ సమయంలో రక్త నష్టాన్ని కూడా భర్తీ చేస్తుంది. బెల్లం ఉపయోగం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే తిమ్మిరి నుంచి ఉపశమనం అందిస్తుంది. అలాగే రక్తం కొరత ఉండదు. దీనితో పాటు పీరియడ్స్ సమయంలో ఐరన్ పుష్కలంగా ఉండే పాలకూర, దానిమ్మ, బీట్‌రూట్ వంటి వాటిని కూడా తీసుకోవాలి. బెల్లం తినడం వల్ల కడుపునొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభించి, నొప్పిని కూడా తగ్గిస్తుంది. బెల్లంలోని మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు కండరాలను రిలాక్స్ చేసి, తిమ్మిరి నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి.
మానసిక స్థితిని మెరుగుదల
పీరియడ్స్ సమయంలో బెల్లం తినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. చిరాకు తగ్గుతుంది. బెల్లం వాడకం వల్ల శరీరంలో సంతోషకరమైన హార్మోన్లు పెరుగుతాయి. దీని కారణంగా ఎక్కువ రిలాక్స్‌గా ఉంటారు.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
చాలా మంది మహిళలు పీరియడ్స్ సమయంలో మలబద్ధకం, ఉబ్బరం సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. పీరియడ్స్ సమయంలో బెల్లం తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. పీరియడ్స్ సమయంలో హార్మోన్లలో మార్పుల కారణంగా మానసిక అస్థిరత ఏర్పడుతుంది. బెల్లం తినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. పోషకాహార నిపుణులు ప్రకారం.. పీరియడ్స్ ప్రారంభానికి 4 నుంచి 5 రోజుల ముందు నుంచే.. బెల్లం తీసుకోవడం ప్రారంభించాలి.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.