AP DSC 2024 Postponed: ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ 2024 పరీక్షలు మళ్లీ వాయిదా.. టెట్‌ ఫలితాలు ఇప్పట్లో లేనట్లే!

ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ-2024) నిర్వహణ, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌ 2024) ఫలితాల వెల్లడిపై గత కొంత కాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారా? లేదంటే వాయిదా వేస్తారా? అని గత కొంతకాలంగా అభ్యర్ధుల్లో తీవ్ర గంధరగోళం ఏర్పడిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఎన్నికల కమిషన్‌ (ఈసీ) క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు టెట్‌ ఫలితాలు, డీఎస్సీ పరీక్ష..

AP DSC 2024 Postponed: ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ 2024 పరీక్షలు మళ్లీ వాయిదా.. టెట్‌ ఫలితాలు ఇప్పట్లో లేనట్లే!
AP DSC 2024 Postponed
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 31, 2024 | 8:09 AM

అమరావతి, మార్చి 31: ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ-2024) నిర్వహణ, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌ 2024) ఫలితాల వెల్లడిపై గత కొంత కాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారా? లేదంటే వాయిదా వేస్తారా? అని గత కొంతకాలంగా అభ్యర్ధుల్లో తీవ్ర గంధరగోళం ఏర్పడిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఎన్నికల కమిషన్‌ (ఈసీ) క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు టెట్‌ ఫలితాలు, డీఎస్సీ పరీక్ష నిర్వహణ వాయిదా వేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా శనివారం (మార్చి 30) ఆదేశాలు జారీ చేశారు. దీంతో త్వరలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ముగిసే వారకు పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు. అప్పటి వరకు డీఎస్సీ పరీక్ష వాయిదా పడనుంది. ఇక టెట్‌ ఫలితాలు కూడా ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాతే వెలువడే అవకాశం ఉంది.

కాగా ఇప్పటికే హైకోర్టు ఆదేశాల మేరకు డీఎస్సీ షెడ్యూల్‌ను మార్చిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 30 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ ఇటీవల ప్రకటించారు. ఆ ప్రకారంగా పరీక్ష కేంద్రాల ఎంపికకు మార్చి 20 నుంచి ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాల్సి ఉంది. మార్చి 25 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని షెడ్యూల్‌లో సూచించారు. కానీ, వెబ్‌సైట్‌లో మాత్రం పరీక్ష కేంద్రాల ఎంపికకు, హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం ఇవ్వలేదు.

ఈ నేపథ్యంలో శనివారం (మార్చి 30) చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌ (సీఈవో) ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు డీఎస్సీ వాయిదా వేయాలని ప్రకటించడంతో అభ్యర్థుల ఉత్కంఠకు తెరపడినట్లైంది. ఇక టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌ 2024) ఫలితాలు ఈ నెల 14న విడుదల కావల్సి ఉండగా ఇంతవరకు ప్రకటించలేదు. తాజాగా ఈసీ ప్రకటన మేరకు ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు టెట్‌ ఫలితాల కూడా వెలువడే అవకాశం లేకుండా పోయింది. డీఎస్సీ మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనేది ప్రభుత్వం త్వరలో వెల్లడించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!