JEE Main 2024: మరో 4 రోజుల్లో జేఈఈ మెయిన్‌ తుది విడత పరీక్షలు.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి!

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లోని ఇంజినీరింగ్‌ బీఈ/బీటెక్‌/బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ 2024 మలి విడత (సెషన్-2) పరీక్షలు మరో నాలుగు రోజుల్లో ప్రారంభంకానున్నాయి. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జేఈఈ మెయిన్‌ తుది విడత పరీక్ష నిర్వహణకు ఎన్‌టీఏ పకడ్భందీ ఏర్పాట్లు చేస్తోంది. దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఏప్రిల్‌ 4, 5, 6, 8, 9, 12 తేదీల్లో పరీక్షలు జరుగనున్న సంగతి తెలిసిందే. పరీక్ష కేంద్రం వివరాలకు సంబంధించి..

JEE Main 2024: మరో 4 రోజుల్లో జేఈఈ మెయిన్‌ తుది విడత పరీక్షలు.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి!
JEE Main 2024 Session 2
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 31, 2024 | 8:38 AM

న్యూఢిల్లీ, మార్చి 31: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లోని ఇంజినీరింగ్‌ బీఈ/బీటెక్‌/బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ 2024 మలి విడత (సెషన్-2) పరీక్షలు మరో నాలుగు రోజుల్లో ప్రారంభంకానున్నాయి. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జేఈఈ మెయిన్‌ తుది విడత పరీక్ష నిర్వహణకు ఎన్‌టీఏ పకడ్భందీ ఏర్పాట్లు చేస్తోంది. దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఏప్రిల్‌ 4, 5, 6, 8, 9, 12 తేదీల్లో పరీక్షలు జరుగనున్న సంగతి తెలిసిందే. పరీక్ష కేంద్రం వివరాలకు సంబంధించి సిటీ ఇంటిమేషన్‌ స్లిప్స్‌ ఇప్పటికే విడుదలయ్యాయి. ఇక నేడో, రేపో హాల్‌ టికెట్లు కూడా విడుదల కానున్నాయి. జేఈఈ మెయిన్‌ పరీక్షలు యేటా రెండు సార్లు నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. తొలి, మలి విడతల్లో బెస్ట్‌ పర్ఫామెన్స్‌ మార్కులను అంతిమంగా పరిగణనలోకి తీసుకుని జేఈఈ అడ్వాన్స్‌ రాసేందుకు అనుమతిస్తారు. దీంతో తొలివిడతలో సరైన ర్యాంకు సాధించలేనివారు మలి విడతలో మరొకసారి దరఖాస్తు చేసుకుని, సత్తా చాటేందుకు అభ్యర్ధులు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్ష రాసే అభ్యర్థులు ఆకరి నిమిషంలో ఎలాంటి తప్పులకు తావివ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు తీసుకోవల్సిన జాగ్రత్తలు ఇవే..

అభ్యర్ధులు పరీక్ష కేంద్రానికి వెళ్లే ముందు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న అడ్మిట్‌ కార్డును తప్పనిసరిగా తమతోపాటు పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి. అడ్మిట్‌ కార్డు లేకపోతే పరీక్ష కేంద్రంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు. పరీక్ష కేంద్రానికి ధ్రువీకరణను సూచించే ఫొటోతో ఉన్న ఏదైనా గుర్తింపు కార్డులను తమతోపాటు తీసుకెళ్లాలి. అంటే పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, 12వ తరగతి అడ్మిట్ కార్డు, పాస్‌పోర్టు, ఆధార్‌ కార్డు, రేషన్‌కార్డు, ఓటర్‌ కార్డు, బ్యాంకు పాసుపుస్తకం.. లో ఏదైనా ఒక కార్డును తీసుకెళ్తే సరిపోతుంది. అలాగే అభ్యర్ధులు తమతోపాటు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోను కూడా తీసుకెళ్లాలి. అటెండెన్స్‌ షీట్‌పై ఫొటోను అతికించాల్సి ఉంటుంది. ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే బాల్‌పాయింట్‌ పెన్‌ తీసుకెళ్లాలి. పరీక్ష సమయానికి రెండు గంటలు ముందుగానే చేరుకొవాలి. లేదంటే చివరి నిమిషంలో కంగారు పడాల్సి ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులైతే ధ్రువీకరన సర్టిఫికెట్‌ను తీసుకెళ్లాలి. జేఈఈ మెయిన్స్ పరీక్ష ఆన్‌లైన్‌లో ఉంటుంది కాబట్టి పరీక్ష సమయంలో ఏదైనా ఇబ్బంది తలెత్తితే కేంద్రం సూపరింటెండెంట్‌ గానీ, ఇన్విజిలేటర్‌ను గానీ సంప్రదించవచ్చు. పరీక్ష కేంద్రంలోకి కాలిక్యులేటర్లు, మొబైల్స్‌, వాచ్‌ వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకెళ్లకూడదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.