Bus Accident: వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి.. ప్రాణాలతో బయపడ్డ 8 ఏళ్ల బాలిక

దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి అమాంతం లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 45 మంది ప్రయాణికులు మృతి చెందారు. 8 ఏళ్ల బాలిక మాత్రమే ప్రాణాలతో బయటపడింది. మొత్తం ప్రయాణికులు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. గురువారం ఈ ప్రమాదం జరిగింది. దక్షిణాఫ్రికా రవాణా శాఖ తెలిపిన వివరాల ప్రకారం..

Bus Accident: వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి.. ప్రాణాలతో బయపడ్డ 8 ఏళ్ల బాలిక
South Africa Bus Accident
Follow us

|

Updated on: Mar 29, 2024 | 7:33 AM

జొహెన్నెస్‌బర్గ్‌, మార్చి 29: దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి అమాంతం లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 45 మంది ప్రయాణికులు మృతి చెందారు. 8 ఏళ్ల బాలిక మాత్రమే ప్రాణాలతో బయటపడింది. మొత్తం ప్రయాణికులు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. గురువారం ఈ ప్రమాదం జరిగింది. దక్షిణాఫ్రికా రవాణా శాఖ తెలిపిన వివరాల ప్రకారం..

జోహన్నెస్‌బర్గ్‌కు ఉత్తరంగా 300 కిలోమీటర్లు (190 మైళ్లు) దూరంలో ఉన్న మమట్లకల సమీపంలోని పర్వత ప్రాంతంలో ఉన్న వంతెనపై బస్సు 46 మంది ప్రయాణికులతో వెళ్తుంది. ఇంతలో బస్సు అదుపుతప్పి కొండపై ఉన్న రోడ్డు మలుపువద్ద పలు మార్లు అడ్డంకులను ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. అనంతరం బస్సు 50 మీటర్లు (164 అడుగులు) లోయలోకి పడిపోయింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మార్చి 31న జరగనున్న ఈస్టర్‌ పండుగ కోసం బోట్స్వానా నుంచి ఉత్తర లింపోపో ప్రావిన్స్‌లోని మోరియా పట్టణంలోని చర్చికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయ చర్యలు చేపట్టినట్లు స్థానిక రవాణా శాఖ పేర్కొంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో 45 మంది చనిపోగా, ప్రాణాలతో బతికున్న బాలికను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. కొన్ని మృతదేహాలు గుర్తించలేనంతగా మంటల్లో కాలిపోయాయని, మరికొన్ని మృతదేహాలు బస్సులో చిక్కుకున్నట్లు పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా ఆఫ్రికన్ ఖండంలోని అత్యంత అభివృద్ధి చెందిన రోడ్ నెట్‌వర్క్‌లలో ప్రమాదం జరిగిన ప్రదేశం ఒకటి. కానీ ఇదే ప్రదేశంలో పలు ప్రమాదాలు జరగడంతో అత్యంత చెత్త భద్రతా రికార్డులలో ఒకటిగా పరిగణిస్తున్నారు.

దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా బోట్స్‌వానా బస్సు ప్రమాద ఘటన పట్ల తీవ్ర దగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటన వెలువరించారు. సంఘటన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈస్టర్ సెలవుల్లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్త వహించాలని అధ్యక్షుడు రమాఫోసా దక్షిణాఫ్రికా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం కొన్ని గంటల వ్యవధిలోనే ఈ బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులు వెళ్లాలనుకున్న జియాన్‌ చర్చ్‌ ఆ దేశంలోనే అతి పెద్ద చర్చిల్లో ఒకటి. దీంతో ఈస్టర్‌ పండగ నేపథ్యంలో వంతెనపై వీపరీతమైన ట్రాఫిక్‌ నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.