AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

మంచి అవకాశాలు, ఉన్నత అవకాశాల కోసం ఇండియన్ స్టూడెంట్స్ విదేశాలకు వెళ్లడం సర్వసాధారణంగా మారిన విషయం తెలిసిందే. అయితే అన్ని రంగాలకు చెందిన విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్తుంటారు. అక్కడకు వెళ్లిన తర్వాత కొందరు దురదృష్టకర సంఘటనలను ఎదుర్కొని తమ కుటుంబాలను తీవ్ర వేదనకు గురిచేస్తున్నారు.

Telangana: విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
Death
Balu Jajala
|

Updated on: Mar 28, 2024 | 9:56 PM

Share

మంచి అవకాశాలు, ఉన్నత అవకాశాల కోసం ఇండియన్ స్టూడెంట్స్ విదేశాలకు వెళ్లడం సర్వసాధారణంగా మారిన విషయం తెలిసిందే. అయితే అన్ని రంగాలకు చెందిన విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్తుంటారు. అక్కడకు వెళ్లిన తర్వాత కొందరు దురదృష్టకర సంఘటనలను ఎదుర్కొని తమ కుటుంబాలను తీవ్ర వేదనకు గురిచేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం అమెరికా వెళ్లిన ఓ టెక్కీ విషయంలోనూ ఇదే జరిగింది. ఇటీవల ఓ టెక్కీ ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాడు. దాదాపు మూడేళ్లుగా ఆయన అక్కడే ఉంటున్నారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో కన్నుమూశారు.

వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి చెందిన చిట్టోజు మహేష్ (34) అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్. మూడేళ్ల క్రితం భార్యతో కలిసి అమెరికా వెళ్లాడు. భార్యాభర్తలు జార్జియా రాష్ట్రంలోని కమ్మింగ్ నగరంలో నివసిస్తున్నారు. ఆఫీసులో పనిచేస్తుండగా ఆయనకు గుండెపోటు వచ్చిందని చెబుతున్నారు. తోటి స్నేహితులు అతడిని ఆస్పత్రికి తరలించారు. కానీ ఆయన మధ్యలోనే చనిపోయాడు. ఈ విషాదవార్తను స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆయన మరణవార్త విని గుండెలవిసేలా ఏడ్చింది భార్య. అతని మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిచేందుకు భార్య, కుటుంబ సభ్యులు ఫండ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే విదేశాల్లో ఇండియన్ స్టూడెంట్స్, ఉద్యోగులు చనిపోవడం తరచుగా వెలుగుచూస్తున్నాయి. ఇటీవల విదేశాల్లో చనిపోయే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగిపోతుందే తప్ప తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో తమ పిల్లల భద్రతకు విదేశాల్లో చట్టాలను కఠినంగా అమలు చేయాలని కోరుతున్నారు.