TS TET 2024: తెలంగాణ టెట్‌ 2024కు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ఇలా అప్లై చేసుకోండి

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (మార్చి) 2024 నిర్వహణకు రాష్ట్ర విద్యాశాఖ ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. టెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 27 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు లింక్‌ అందుబాటులోకి వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఏప్రిల్‌ 10వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు ఇచ్చింది. ఇక మే 20 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో..

TS TET 2024: తెలంగాణ టెట్‌ 2024కు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ఇలా అప్లై చేసుకోండి
TS TET 2024
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 28, 2024 | 8:06 AM

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (మార్చి) 2024 నిర్వహణకు రాష్ట్ర విద్యాశాఖ ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. టెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 27 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు లింక్‌ అందుబాటులోకి వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఏప్రిల్‌ 10వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు ఇచ్చింది. ఇక మే 20 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు ఇప్పటికే నోటిఫికేషన్‌లో విద్యాశాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11 జిల్లా కేంద్రాల్లో టెట్‌ పరీక్షను నిర్వహిస్తారు. కాగా ప్రభుత్వం భర్తీ చేసే ఉపాధ్యాయుల పోస్టులకు హాజరుకావాలంటే తప్పనిసరిగా టెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. టెట్‌లో కనీస అర్హత మార్కులు సాధించిన వారు టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ) రాసేందుకు అర్హులు. టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టీఆర్‌టీలో 80 శాతం మార్కులకు పరీక్ష నిర్వహించి మిగిలిన 20 శాతం మార్కులను టెట్‌ నుంచి తీసుకుని తుది ర్యాంకు నిర్ణయిస్తారు.

టెట్‌ పరీక్ష మొత్తం 2 పేపర్లకు ఉంటుంది. పేపర్‌-1కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు డీఈడీలో అర్హత సాధించి ఉండాలి. ఇంటర్‌లో జనరల్‌ అభ్యర్థులు 50 శాతం, ఇతరులు 45 శాతం మార్కులు తప్పనిసరిగా సాధించి ఉండాలి. 2015లోపు డీఈడీ చేసిన వారైతే జనరల్‌ అభ్యర్థులు ఇంటర్‌లో 45 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులతో పాసైతే అర్హత సాధించినట్లే. ఇక టెట్‌ పేపర్‌-2కి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు డిగ్రీ, బీఈడీలో కనీస అర్హత మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. డిగ్రీలో జనరల్‌ అభ్యర్థులు 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు సాధించి ఉండాలి. 2015లోపు బీఈడీ చేసిన వారైతే జనరల్‌ అభ్యర్ధులు 50 శాతం, ఇతరులు 40 శాతం మార్కులు సాధించినా అర్హత సాధించినట్లే.

ఆన్‌లైన్‌ దరఖాస్తు సమయంలో ఒక్కో పేపర్‌కు రూ.1000 చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. రెండు పేపర్లు రాస్తే రూ.2,000, మూడు పేపర్లకు రాస్తే రూ.3000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. టెట్‌ ఒక్కో పేపర్‌ 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. జనరల్‌ కేటగిరీలో 90 మార్కులు, బీసీలో 75 మార్కులు, ఎస్‌సీ/ఎస్‌టీ/దివ్యాంగులు 60 మార్కులు సాధిస్తే టెట్‌ అర్హత పొందొచ్చు. పేపర్‌-1 పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, పేపర్‌-2 పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ 2024 కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?