ED Search Operation: వాషింగ్ మెషిన్‌లో దాచిన కోట్ల రూపాయల నోట్ల కట్టలు.. 47 బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్! అడ్డం తిరిగిన కథ..
హైదరాబాద్‌తో సహా ముంబై, ఢిల్లీ, కురుక్షేత్ర, కోల్‌కతా వంటి పలు మేజర్ సిటీలలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తాజాగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) నిబంధనల ఉల్లంఘన కేసులో ఈ సోదాలు చేపట్టింది. ఈడీ సెర్చ్ ఆపరేషన్‌లో అధికారులకు కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. ఓ ఇంట్లోని వాహింగ్ మెషిన్‌లో రూ.2.54 కోట్ల రూపాయల విలువైన నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు..
ఢిల్లీ, మార్చి 27: హైదరాబాద్‌తో సహా ముంబై, ఢిల్లీ, కురుక్షేత్ర, కోల్‌కతా వంటి పలు మేజర్ సిటీలలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తాజాగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) నిబంధనల ఉల్లంఘన కేసులో ఈ సోదాలు చేపట్టింది. ఈడీ సెర్చ్ ఆపరేషన్‌లో అధికారులకు కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. ఓ ఇంట్లోని వాహింగ్ మెషిన్‌లో రూ.2.54 కోట్ల రూపాయల విలువైన నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఈడీ మంగళవారం కీలక సమాచారం వెల్లడించింది.
క్యాప్రికార్నియన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థల డైరెక్టర్లు విజయ్ కుమార్ శుక్లా, సంజయ్ గోస్వామితో పాటు దాని అనుబంధ సంస్థలైన M/s లక్ష్మీటన్ మారిటైమ్, M/s హిందుస్థాన్ ఇంటర్నేషనల్, M/s రాజనందిని మెటల్స్ లిమిటెడ్, M/s స్టావర్ట్ అల్లాయ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, M/s భాగ్యనగర్ లిమిటెడ్, M/s వినాయక్ స్టీల్స్ లిమిటెడ్, M/s వశిష్ట కన్స్ట్రక్షన్స్ Pvt Ltdలతోపాటు ఈ సంస్థల భాగస్వాములు సందీప్ గార్గ్, వినోద్ కేడియా నివాసాల్లోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సంస్థలు బోగస్ సరకు రవాణా, దిగుమతుల పేరిట షెల్ కంపెనీల సాయంతో సింగపూర్‌కు చెందిన రెండు సంస్థలతో రూ.1800 కోట్ల మేర అనుమానాస్పద లావాదేవీలు జరిపినట్లు ఈడీకి సమాచారం అందింది.
దీంతో రంగంలోకి దిగిన ఈడీ క్యాప్రికార్నియన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్, దాని అనుబంధ సంస్థల ప్రాంగణాల్లో ఆకస్మిక తనిఖాలు చేశారు. సోదాల్లో ఓ చోట వాషింగ్‌మెషిన్‌లో దాచి ఉంచిన రూ.2.54 కోట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విలువైన పత్రాలు, డిజిటల్ పరికరాలను ఈడీ సీజ్ చేసింది. అనుబంధ సంస్థలతో ప్రమేయం ఉన్న 47 బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన వివరాలను ఈడీ ‘ఎక్స్’లో ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.