Telangana: హోలీ వేడుకల్లో పెను విషాదం.. నీట మునిగి 14 మంది మృతి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన హోలీ వేడుకల్లో పలుచోట్ల అపశ్రుతి చోటు చేసుకుంది. హోలీ అనంతరం నదులు, కాల్వలు, చెరువు వద్ద స్నానాలకు వెళ్లిన పలువురు వేరువేరు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. దాదాపు 14 మంది మరణించగా.. ఒకరు గల్లంతయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని కౌటాల మండల కేంద్రంలోని నదీమాబాద్‌కు చెందిన..

Telangana: హోలీ వేడుకల్లో పెను విషాదం.. నీట మునిగి 14 మంది మృతి
Tragic Incidents In Holi
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 26, 2024 | 7:08 AM

హైదరాబాద్, మార్చి 26: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన హోలీ వేడుకల్లో పలుచోట్ల అపశ్రుతి చోటు చేసుకుంది. హోలీ అనంతరం నదులు, కాల్వలు, చెరువు వద్ద స్నానాలకు వెళ్లిన పలువురు వేరువేరు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. దాదాపు 14 మంది మరణించగా.. ఒకరు గల్లంతయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని కౌటాల మండల కేంద్రంలోని నదీమాబాద్‌కు చెందిన నలుగురు యువకులు తాటిపల్లి సమీపంలోని వార్దా నదిలో స్నానానికి వెళ్లి నీట మునిగి మరణించారు. మృతులను పనాస కమలాకర్‌ (23), ఉప్పుల సంతోష్‌ (22), ఎల్ములే ప్రవీణ్‌ (23), ఆలం సాయి (20)లుగా గుర్తించారు. ఇక మంచిర్యాలలో ఇంటర్‌ విద్యార్థి స్నేహితులతో స్నానానికి వెళ్లి నీటమునిగి చనిపోయాడు. జన్నారం మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన ఇంటర్‌ చదివే కార్తిక్‌ సోమవారం తన స్నేహితులతో కలిసి తానిమడుగు డెలివరీ పాయింట్‌ వద్ద నీటిలోకి దిగాడు. అయితే ఈత రాకపోవడంతో నీళ్లలో మునిగిపోయాడు. ఆదిలాబాద్‌లోని జైజవాన్‌ నగర్‌కు చెందిన హర్షిత్‌ (14) మండలంలోని భీంసరి వాగులో ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నందుపల్లికి చెందిన భిక్షమయ్య కుమారుడు సంగం జగన్‌ (27), రామయ్య కుమారుడు కొమ్ము సురేందర్‌ (28) ఇద్దరు చెరువులో పడి మృతి చెందారు. ఇద్దరు హోలీ ఆడిన తర్వాత నందపల్లి పెద్ద చెరువు దగ్గరకు ఈత కొడుతూ కనిపించకుండాపోయారు. గజఈతగాళ్లు వీరి మృతదేహాలను బయటకు తీశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని 20వ వార్డులో చిన్నారులు హోలీ ఆడుతుంగా పక్కనే ఉన్న వాటర్‌ ట్యాంక్‌ ఒక్కసారిగా కూలడంతో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ లక్ష్మీప్రణీత అనే చిన్నారి చనిపోయింది. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలం మామిడిమాడలో హోలీ ఆడిన తర్వాత స్నానం చేసేందుకు వ్యవసాయ బావి వద్దకు వెల్లిన యువకుల్లో శ్రీకాంత్‌ (16) నీటిలో మునిగి చనిపోయాడు.

మహబూబాబాద్‌లో అబ్బోరి వినోద్‌రెడ్డి కుమారుడు రిత్విక్‌రెడ్డి (10) 4వ తరగతి చదువుతున్న బాలుడు చెరువులోని గుంతలో పడి మృతి చెందాడు. మొర్రేడు వాగులో ఆటో డ్రైవర్‌ మోకాళ్ల రాంబాబు (25) మొర్రేడు వాగులో ప్రమాదవశాత్తు జారిపడిపోయి మృతిచెందాడు. హనుమకొండలోని కేయూ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పలివేల్పుల ఎస్సారెస్సీ కెనాల్‌లో పడి తక్కెళ్ల కేదారేశ్వర్‌ (42), ముప్పు క్రాంతికు మార్‌ (35) అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా ఒకరు గల్లంతయ్యారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14 మంది వేర్వేరు ప్రమాదాల్లో నీట మునిగి మృత్యువాత పడ్డారు. దీంతో పండగ వేళ ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గుడిమెల్లంక గ్రామానికి ఆధ్యాత్మిక శోభ.. రూ.300 కోట్ల వ్యయంతో భారీ
గుడిమెల్లంక గ్రామానికి ఆధ్యాత్మిక శోభ.. రూ.300 కోట్ల వ్యయంతో భారీ
భారత అమ్ములపొదలోకి అత్యాధునిక మిస్సైళ్లు!
భారత అమ్ములపొదలోకి అత్యాధునిక మిస్సైళ్లు!
మీకు ఆధార్‌ కార్డ్‌ ఉందా.? వెంటనే ఈ పనిచేయండి..
మీకు ఆధార్‌ కార్డ్‌ ఉందా.? వెంటనే ఈ పనిచేయండి..
14 ఏళ్లకే హీరోయిన్‏గా ఏంట్రీ..చిరంజీవి అలా పిలుస్తూ ఏడిపించేవారు.
14 ఏళ్లకే హీరోయిన్‏గా ఏంట్రీ..చిరంజీవి అలా పిలుస్తూ ఏడిపించేవారు.
చివరిగా.. ట్రంప్‌ను ఓ కోర్కె కోరిన జో బిడెన్‌..!
చివరిగా.. ట్రంప్‌ను ఓ కోర్కె కోరిన జో బిడెన్‌..!
చలికాలం సమస్యలకు కొబ్బరి నూనెతో చెక్‌.. ముఖానికి అప్లై చేస్తే..
చలికాలం సమస్యలకు కొబ్బరి నూనెతో చెక్‌.. ముఖానికి అప్లై చేస్తే..
ఈ పూలను వాడితే ముసలితనాన్ని వాయిదా వేయొచ్చు.. అందం అమాంతంగాపెరిగి
ఈ పూలను వాడితే ముసలితనాన్ని వాయిదా వేయొచ్చు.. అందం అమాంతంగాపెరిగి
అమెరికాలో తులసీ గబ్బార్డ్‌కు కీలక బాధ్యతలు.. ఎవరో తెలుసా?
అమెరికాలో తులసీ గబ్బార్డ్‌కు కీలక బాధ్యతలు.. ఎవరో తెలుసా?
బంగారం కొనేవారికి శుభవార్త..! ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
బంగారం కొనేవారికి శుభవార్త..! ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
బామ్మ గెటప్‏లో బిగ్‏బాస్ ముద్దుగుమ్మ.. ఇట్టా మారిపోయిందేంట్రా..
బామ్మ గెటప్‏లో బిగ్‏బాస్ ముద్దుగుమ్మ.. ఇట్టా మారిపోయిందేంట్రా..