AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IIT Guwahati: ఉగ్రసంస్థ ఐసిస్‌తో ఐఐటీ గువహటి విద్యార్ధులకు లింకులు.. ఒకరి అరెస్ట్, మరొకరు పరార్‌!

ఐఐటీ గౌహతిలో నాలుగో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి సోషల్ మీడియాలో అంతర్జాతీయ ఉగ్ర సంస్థ ఐసిస్‌ సంబంధాలున్నాయన్న ఆరోపణలపై అరెస్ట్‌ అయినట్లు పోలీసులు ఆదివారం (మార్చి 24) మీడియాకు తెలిపారు. బీటెక్‌ బయోసైన్స్‌ నాలుగో ఏడాది చదువుతున్న తౌసీఫ్ అలీ ఫరూఖీ అనే విద్యార్థిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం ఉపా కింద కేసు నమోదు చేశారు. ఫరూఖీ ఢిల్లీకి చెందిన వాడని..

IIT Guwahati: ఉగ్రసంస్థ ఐసిస్‌తో ఐఐటీ గువహటి విద్యార్ధులకు లింకులు.. ఒకరి అరెస్ట్, మరొకరు పరార్‌!
IIT Guwahati student arrest
Srilakshmi C
|

Updated on: Mar 25, 2024 | 10:43 AM

Share

గువాహటి, మార్చి 25: ఐఐటీ గౌహతిలో నాలుగో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి సోషల్ మీడియాలో అంతర్జాతీయ ఉగ్ర సంస్థ ఐసిస్‌ సంబంధాలున్నాయన్న ఆరోపణలపై అరెస్ట్‌ అయినట్లు పోలీసులు ఆదివారం (మార్చి 24) మీడియాకు తెలిపారు. బీటెక్‌ బయోసైన్స్‌ నాలుగో ఏడాది చదువుతున్న తౌసీఫ్ అలీ ఫరూఖీ అనే విద్యార్థిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం ఉపా కింద కేసు నమోదు చేశారు. ఫరూఖీ ఢిల్లీకి చెందిన వాడని పోలీసులు తెలిపారు. విచారణ జరిపిన అనంతరం ఐసిస్‌తో సంబంధాలున్నట్లు పక్కా ఆధారాలు లభ్యమవడంతో శనివారం సాయంత్రం అస్సాంలోని కమ్రూప్‌ జిల్లాలో అరెస్ట్‌ చేసినట్లు అస్సాం పోలీస్‌ టాస్క్‌ఫోర్స్‌ ఐజీ పార్థసారధి మహంతా మీడియాకు తెలిపారు.

‘ఐఎస్‌ఐఎస్‌తో అతడికి ఉన్న సంబంధాలకు సంబంధించి విశ్వసనీయమైన ఆధారాలు లభించాయి. విద్యార్థి ఫరూఖీని ఆదివారం అరెస్టు చేశాం. కోర్టులో హాజరుపరిచాం. కోర్టు అతడికి 10 రోజులపాటు పోలీసు కస్టడీ విధించింది. ఐఐటి-గౌహతి క్యాంపస్‌లోని అతని హాస్టల్ గదిలో కూడా మేము సోదాలు చేసాం. అతని హాస్టల్ గదిలో ఐసిస్ జెండాను పోలిన నల్ల జెండా, మరికొన్ని ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు’ అస్సాం పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్) ఇన్‌స్పెక్టర్ జనరల్ పార్థసారథి మహంత తెలిపారు. నిందితుడు ఫరూఖీ సోషల్ మీడియాలో ఐసిస్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రతిజ్ఞ చేయడం, ఉగ్రవాద బృందంలో చేరాలని తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఈమెయిల్ పంపడం వంటి వివరాలు అతడి ఈ మెయిల్‌లో లభ్యమయ్యాయి. దీంతో ఐఐటికి 20 కిలోమీటర్ల దూరంలోని హజో సమీపంలో కొంతమంది స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

మూడు రోజుల క్రితం బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన ఐసిస్‌ భారత్‌ చీఫ్‌ హారిస్‌ ఫరూఖీ అలియాస్ హరీష్ అజ్మల్ ఫరూఖీ, అతని సహచరుడు అనురాగ్ సింగ్ అలియాస్ రెహాన్‌లను పశ్చిమ అస్సాంలోని ధుబ్రీ జిల్లాలో అరెస్టు చేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ ఐజీ. ఇది జరిగిన నాలుగు రోజుల తర్వాత యువకులను అదుపులోకి తీసుకున్నారు. హరీష్ అజ్మల్ ఫరూఖీ, రెహాన్‌లు భారత్‌ అంతటా ఐఈడీ పేలుళ్లకు ప్లాన్‌ చేస్తున్నట్టు తెలిపారు.

ఇవి కూడా చదవండి

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. ఐఐటి-గువాహటికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలు కలిగి ఉన్నారని, గ్రూప్‌లో చేరడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే వారిలో ఒకరు ప్రస్తుతానికి గుర్తించబడలేదు. పోలీస్ కస్టడీలో ఉన్న విద్యార్థి ఫరూఖీని విచారించిన తర్వాత పూర్తి వివరాలు బయటికి వస్తాయి. తప్పించున్న మరో విద్యార్ధిని కూడా త్వరలోనే పట్టుకుంటాం. ఉగ్రవాదం వైపు ప్రేరేపితులైన ఈ విద్యార్ధుల గురించి కేంద్ర సంస్థలకు సమాచారం అందించామని సీఎం హిమంత బిస్వా శర్మ చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.