AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arvind Kejriwal Arrest: సీఎం కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు.. దక్కని ఊరట!

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్‌ కేసులో మనీ ల్యాండరింగ్‌ ఆరోపణలపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ (55) అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అరెస్ట్‌పై వేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణకు కోర్టు నిరాకరించింది. తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్‌ శనివారం (మార్చి 23) హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తన అరెస్టు, రిమాండ్‌ చట్టవిరుద్ధమని..

Arvind Kejriwal Arrest: సీఎం కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు.. దక్కని ఊరట!
Arvind Kejriwal
Srilakshmi C
|

Updated on: Mar 24, 2024 | 9:12 AM

Share

న్యూఢిల్లీ, మార్చి 24: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్‌ కేసులో మనీ ల్యాండరింగ్‌ ఆరోపణలపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ (55) అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అరెస్ట్‌పై వేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణకు కోర్టు నిరాకరించింది. తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్‌ శనివారం (మార్చి 23) హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తన అరెస్టు, రిమాండ్‌ చట్టవిరుద్ధమని, వెంటనే విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును అత్యవసర విచారణ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను అత్యవసరంగా శనివారం లేదంటే ఆదివారం విచారించాలని కోరారు. అయితే ఇందుకు కోర్టు నిరాకరించింది. హోలీ సెలవుల తర్వాత బుధవారం (మార్చి 27) విచారణ చేపడతామని, అప్పటికి కేసు విచారణను జాబితా చేస్తున్నట్లు కోర్టు తెలిపింది.

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను గత గురువారం కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు శుక్రవారం ఆరు రోజుల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి రిమాండ్ చేసింది. తన అరెస్ట్, రిమాండ్ ఆర్డర్ రెండూ చట్టవిరుద్ధమని, తక్షణమే కస్టడీ నుంచి విడుదల కావడానికి తనకు అర్హత ఉందని కేజ్రీవాల్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ED కస్టడీపై మొదట పోరాడాలని పార్టీ నిర్ణయించినందున, తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన తన పిటిషన్‌ను శుక్రవారం ఉపసంహరించుకున్నారు. రిమాండ్ దరఖాస్తు విచారణ సందర్భంగా.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో కేజ్రీవాల్ కీలక కుట్రదారు, కింగ్‌పిన్ అని ED కోర్టులో వాదించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తెలంగాణ ఎమ్మెల్సీ కె కవితతో కేజ్రీవాల్‌కు సంబంధాలు ఉన్నాయని ఈడీ పేర్కొంది. పాలసీని రూపొందించడంలో, కిక్‌బ్యాక్‌లు డిమాండ్ చేయడంలో, ఈ నేరాల ద్వారా వచ్చే ఆదాయాన్ని నిర్వహించడంలో కేజ్రీ నేరుగా పాల్గొన్నట్లు ఏజెన్సీ ఆరోపించింది.

మరోవైపు తనపై వచ్చిన ఆరోపణ స్కాంతో తనకు సంబంధం ఉన్నట్లు నిరూపించే ఎటువంటి ఆధారాలు లేవని కేజ్రీవాల్ కోర్టులో వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్నా కోర్టు ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమని కోర్టు భావించింది. దీంతో కేజ్రీకి మార్చి 28 వరకు ఈడీ కస్టడీ విధించింది. జైల్లో ఉన్న ముఖ్యమంత్రిగా కొనసాగుతానని, అవసరమైతే జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతానని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.