Road Accidents: రోడ్డు ప్రమాదంలో వాళ్లే ఎక్కువ చనిపోతున్నారట.. లేటెస్ట్ రిపోర్ట్ లో షాకింగ్ విషయాలు
ఇండియాలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతుందే తప్పా.. ఏమాత్రం తగ్గడం లేదు. సరైన ట్రాఫిక్ష్ రూల్స్ పాటించకపోవడం, నిర్లక్స్యంగా వ్యవహరించడం కారణంగా విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అయితే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మగవాళ్లే చనిపోతున్నారు. వారిలో విద్యార్థులు కూడా ఉన్నారు.
ఇండియాలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతుందే తప్పా.. ఏమాత్రం తగ్గడం లేదు. సరైన ట్రాఫిక్ష్ రూల్స్ పాటించకపోవడం, నిర్లక్స్యంగా వ్యవహరించడం కారణంగా విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అయితే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మగవాళ్లే చనిపోతున్నారు. వారిలో విద్యార్థులు కూడా ఉన్నారు. అయితే బెంగళూరు నగరంలో 2023లో మొత్తం 913 ప్రమాదాలు జరగ్గా, 883 మంది మరణించారు. 2022 కంటే 2023లో ప్రమాదాలు 17 నుంచి 18 శాతం ఎక్కువ. 2022లో రోడ్డు ప్రమాదాల్లో 770 మంది మరణించారు. వారిలో 393 మంది 21-40 ఏళ్ల మధ్య వయసున్న పురుషులు ఉన్నారు.
గత ఏడాది బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిలో ఎక్కువ మంది పురుషులేనని, వారిలో ఎక్కువ మంది విద్యార్థులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పని చేసే వయసులో ఉన్నవారేనని డెక్కన్ హెరాల్డ్ అనే ప్రైవేట్ వార్తా సంస్థ వెల్లడించింది. హెల్మెట్ ధరించకపోవడం, అతివేగంగా నడపడం వల్లే ప్రమాదానికి కారణమని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అయితే సిటీలో జనాభా రోజురోజుకూ పెరుగుతోంది. అదేవిధంగా వాహనాల సంఖ్య కూడా పెరిగింది. దీంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.
గత ఏడాది 31-40 ఏళ్ల మధ్య వయసున్న 165 మంది పురుషులు (34 శాతం) మరణించారు. 2022లో మొత్తం 123 మంది పురుషులు మరణించారు. 21-30 ఏళ్ల మధ్య వయసున్న మరో 140 మంది ప్రమాదవశాత్తు మరణించారు. 2023లో 21-30 ఏళ్ల మధ్య వయసున్న 228 మంది పురుషులు మరణించగా, 2022లో 219 మంది మరణించారు. 2023లో, 11-20 సంవత్సరాల వయస్సు గల 41 మంది బాలురు మరణించారు. 2022లో 26 మంది యువకులు చనిపోయారు.
హెల్మెట్, సీటు బెల్ట్ ధరించకపోవడం, అతివేగంగా నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. వాహనదారులు, పాదచారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ఎంఎన్ అనుచేత్ తెలిపారు. వాహనాల సంఖ్యతో పాటు పెరుగుతున్న జనాభా కారణంగా ప్రాణనష్టం జరుగుతోంది ఉన్నతాధికారులు చెబుతున్నారు.