ఎన్నికల ఎఫెక్ట్‌తో కేంద్రం సంచలన నిర్ణయం.. ఉల్లి ఎగుమతులపై నిషేధం.. మార్కెట్‌లో ధరలు పెరుగుతాయా..?
సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తుంది. ఈ సందర్భంగా కేంద్రం ఉల్లి ఎగుమతులపై సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ఎఫెక్ట్ నేపథ్యంలో మరోసారి ఉల్లి ఎగుమతులను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2023 డిసెంబర్‌లో కేంద్రం ఉల్లి ఎగుమతులను 2024 మార్చి 31వరకు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజెంట్ ఎన్నికల సమయం కావడంతో ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధాన్ని మరింత పొడిగించింది. తదుపరి నోటీసు వచ్చే వరకు నిషేధం కొనసాగుతోందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తుంది. ఈ సందర్భంగా కేంద్రం ఉల్లి ఎగుమతులపై సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ఎఫెక్ట్ నేపథ్యంలో మరోసారి ఉల్లి ఎగుమతులను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2023 డిసెంబర్‌లో కేంద్రం ఉల్లి ఎగుమతులను 2024 మార్చి 31వరకు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజెంట్ ఎన్నికల సమయం కావడంతో ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధాన్ని మరింత పొడిగించింది. తదుపరి నోటీసు వచ్చే వరకు నిషేధం కొనసాగుతోందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిషేదాన్ని ఎత్తివేస్తే.. ప్రజెంట్ సామాన్యులకు అందుబాటులో ఉన్న ధరలు పెరుతాయని యోచింది. ఉల్లి ధరలు పెరిగితే ఆఎఫెక్ట్ ఎన్నికలపై పడుతుందనే ఆలోచనతో మరోసారి ఉల్లి ఎగుమతులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా.. వచ్చే పండుగలకు కూడా ఇది ప్రభావం చూపే అవకాశం ఉందన్న నేపథ్యంలో నిషేధం విధించినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు కేంద్రం తీసుకున్న నిర్ణయం మీద వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నిర్ణయం ఆశ్చర్యకరంగా ఉందని.. కొత్త పంటతో సరఫరా పెరిగినా నిషేధం విధించడం సరికాదంటున్నారు. కొత్తపంట వల్ల స్టాక్ పెరిగిపోతుందని ఆందోళన చెందుతున్నారు. అత్యధికంగా ఉల్లిని ఉత్పత్తి చేసే మహారాష్ట్రలోని కొన్ని హోల్‌సేల్ మార్కెట్లలో ఉల్లి ధరలు డిసెంబర్‌లో 100 కిలోలు 4,500 ఉండగా.. ఇప్పుడు 1,200కి పడిపోయాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో కిలో ఉల్లిపాయలను 20 వరకు విక్రయిస్తున్నారు.
ఎగుమతి నిషేధం విధించినప్పటి నుంచి స్థానిక ధరలు సగానికి దిగిపోయాయి. ఉల్లి ఎగుమతుల్లో భారత్ ప్రపంచంలోనే టాప్ ప్లేస్ లో ఉంది. బంగ్లాదేశ్, మలేషియా, నేపాల్, యూఏఈ దేశాలు భారత్ నుంచి దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి. కేంద్రం నిషేధం విధించిన నేపథ్యంలో ఆయా దేశాల్లో ఉల్లి ధరలు ఆకాశాన్నంటున్నాయి. ఆసియా దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉల్లిలో సగానికి పైగా భారత్‌నుంచి వెళ్తోంది.
మార్చి 31, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశం రికార్డు స్థాయిలో 2.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను ఎగుమతి చేసినట్లు వ్యాపారవర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 19 నుంచి ఏడు వారాల పాటు దేశంలో సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఉల్లి ఎగుమతులను నిషేదిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




