AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sindoor: ‘సింధూరం’ ధరించడం హిందూ వివాహిత బాధ్యత.. అప్పుడే వివాహితగా గుర్తింపు’.. కోర్టు తీర్పు

పాపిటలో సింధూరం (బొట్టు) పెట్టుకోవడం హిందూ వివాహిత బాధ్యత అని, అది పెట్టుకుంటే ఆమె వివాహితగా తెలుస్తుందని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ ఫ్యామిలీ కోర్టు వ్యాఖ్యానించింది. ఇండోర్‌కు చెందిన జంటకు 2017లో వివాహం జరిగింది. వారికి ఐదేండ్ల కుమారుడు ఉన్నాడు. అయితే ఐదేళ్ల క్రితం తన భార్య తనను వదిలి వెళ్లిందని, ఆమె మళ్లీ తన ఇంటికి తిరిగి వచ్చి, హిందూ వివాహ చట్టం ప్రకారం తన భార్య..

Sindoor: 'సింధూరం' ధరించడం హిందూ వివాహిత బాధ్యత.. అప్పుడే వివాహితగా గుర్తింపు'.. కోర్టు తీర్పు
Wearing Sindoor Religious Duty Of Woman
Srilakshmi C
|

Updated on: Mar 24, 2024 | 11:44 AM

Share

ఇండోర్‌, మార్చి 24: పాపిటలో సింధూరం (బొట్టు) పెట్టుకోవడం హిందూ వివాహిత బాధ్యత అని, అది పెట్టుకుంటే ఆమె వివాహితగా తెలుస్తుందని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ ఫ్యామిలీ కోర్టు వ్యాఖ్యానించింది. ఇండోర్‌కు చెందిన జంటకు 2017లో వివాహం జరిగింది. వారికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే ఐదేళ్ల క్రితం తన భార్య తనను వదిలి వెళ్లిందని, ఆమె మళ్లీ తన ఇంటికి తిరిగి వచ్చి, హిందూ వివాహ చట్టం ప్రకారం తన భార్య తనతో కలిసి ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని భర్త కోర్టుకు ఎక్కాడు.

ఈ మేరకు ఇండోర్‌ ఫ్యామిలీ కోర్టులో అతను పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌ను విచారించిన ఇండోర్‌ ఫ్యామిలీ కోర్టు ప్రిన్సిపల్‌ జడ్జి ఎన్‌పీ సింగ్‌ తీర్పు సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోర్టు విచారణ సమయంలో హాజరైన బాధితుడి భార్య తాను సింధూరం ధరించడం లేదనే విషయం కోర్టుకు తెలిపింది.

సింధూరం పెట్టుకోవడం హిందూ వివాహిత బాధ్యత. ఇది మహిళకు వివాహం అయిన విషయాన్ని నిర్ధారిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. మహిళ స్టేట్‌మెంట్‌ విన్న తర్వాత భర్త ఆమెను విడిచిపెట్టలేదని, ఆమే భర్తను విడిచిపెట్టి, విడాకులు కోరుతున్నట్లు స్పష్టమైంది. ఆమె తన భర్త కట్నం కోసం తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపించింది. అయితే ఇందుకు సంబంధించి సరైన ఆధారాలు లభ్యం కాలేదు. భర్త తనను వేధిస్తున్నట్లు పోలీసులకు ఆమె ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఇరు వైపుల వాదనలు విన్న తర్వాత.. ఆమే తన భర్తను విడిచిపెట్టింది. అందుకే సింధూర్‌ ధరించలేదని కోర్టు పేర్కొంది. హిందూ ఆచారం ప్రకారం సింధూర్ ధరించడం మహిళ విధి. అది ఆమె వివాహం చేసుకున్నట్లు సూచిస్తుంది. మహిళ వెంటనే తన భర్త ఇంటికి తిరిగి వెళ్లాలని తీర్పు సందర్భంగా పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు