AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pig Kidney Transplant: బతికున్న మనిషికి పంది కిడ్నీ అమర్చిన వైద్యులు.. వైద్య చరిత్రలోనే తొలిసారి!

ప్రపంచంలోనే తొలిసారిగా ఓ రోగికి పంది కిడ్నీ విజయవంతంగా అమర్చారు. దీంతో జంతువుల అవయవాలను ఉపయోగించి మనుషుల ప్రాణాలు కాపాడే ప్రయత్నాల్లో భాగంగా మరో కీలక ముందడుగు వేసినట్లైంది. అమెరికా వైద్య నిపుణులు ఈ మేరకు గురువారం (మార్చి 21) పంది కిడ్నీని ఓ వ్యక్తికి అమర్చినట్లు మీడియాకు తెలిపారు. ఎండ్-స్టేజ్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న 62 ఏళ్ల ఓ రోగికి జన్యు సవరణ విధానంలో అభివృద్ధి చేసిన..

Pig Kidney Transplant: బతికున్న మనిషికి పంది కిడ్నీ అమర్చిన వైద్యులు.. వైద్య చరిత్రలోనే తొలిసారి!
Pig Kidney Transplant
Srilakshmi C
|

Updated on: Mar 22, 2024 | 6:42 AM

Share

వాషింగ్టన్‌, మార్చి 22: ప్రపంచంలోనే తొలిసారిగా ఓ రోగికి పంది కిడ్నీ విజయవంతంగా అమర్చారు. దీంతో జంతువుల అవయవాలను ఉపయోగించి మనుషుల ప్రాణాలు కాపాడే ప్రయత్నాల్లో భాగంగా మరో కీలక ముందడుగు వేసినట్లైంది. అమెరికా వైద్య నిపుణులు ఈ మేరకు గురువారం (మార్చి 21) పంది కిడ్నీని ఓ వ్యక్తికి అమర్చినట్లు మీడియాకు తెలిపారు. ఎండ్-స్టేజ్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న 62 ఏళ్ల ఓ రోగికి జన్యు సవరణ విధానంలో అభివృద్ధి చేసిన పంది మూత్రపిండాన్ని గత శనివారం 4 గంటల పాటు ఆపరేషన్‌ నిర్వహించి అమర్చినట్లు మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. జీవించి ఉన్న వ్యక్తికి పంది కిడ్నీని అమర్చడం ఇదే తొలిసారని వారు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న మిలియన్ల మంది రోగులకు ఈ విధమైన అవయవ మార్పిడి విధానం పునర్జన్మను ఇస్తుందని గ్రౌండ్ బ్రేకింగ్ ఆపరేషన్ చేసిన బృందం సభ్యుడు డాక్టర్ టాట్సువో కవాయ్ తెలిపారు.

ట్రాన్స్‌ప్లాంట్ కోసం ఉపయోగించిన పిగ్ కిడ్నీని మసాచుసెట్స్ బయోటెక్ కంపెనీ ఈజెనెసిస్ అందించిందని, హానికరమైన పంది జన్యువులను తొలగించి కొన్ని మానవ జన్యువులను జోడించి జన్యుపరంగా సవరణ చేసినట్లు తెలిపారు. ఇది వైద్య చిరిత్రలోనే సరికొత్త రికార్డు సాధించినట్లైందని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న మిలియన్ల మంది రోగుల జీవితాలను మార్చడానికి జీనోమ్ ఇంజనీరింగ్ సామర్థ్యం ఉపయోగపడుతుందని ఇజెనెసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మైక్ కర్టిస్ అన్నారు. రోగికి ఈ నెలలోనే సంబంధిత శస్త్రచికిత్స చేశామని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, త్వరలోనే డిశ్చార్జ్‌ చేస్తామని వెల్లడించారు. అవయవ గ్రహీత శరీరం పంది మూత్ర పిండాన్ని స్వీకరించడానికి అవసరమైన రోగనిరోధక శక్తిని పెంపొందించే మందులను వినియోగిస్తున్నట్లు తెలిపారు. కాగా గతంలోనూ ఇద్దరు వ్యక్తులకు పంది గుండెలను తాత్కాలికంగా మార్పిడి చేశారు. అయితే ఆ వారిద్దరూ నెల కన్నా తక్కువ రోజుల్లోనే మరణించారని గుర్తుచేశారు. అలాగే టైప్ 2 డయాబెటిస్, హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న స్లేమాన్ అనే అనే వ్యక్తికి 2018లో పంది కిడ్నీ మార్పిడి చేశారు. అయితే అది ఐదేళ్ల తర్వాత విఫలమైంది. ప్రస్తుతం అతను డయాలసిస్‌తో ప్రాణాలు నిపుకుంటున్నాడు.

ఒక జాతి నుంచి మరొక జాతికి అవయవాలను మార్పిడి చేసే పద్ధతిని జెనోట్రాన్స్‌ప్లాంటేషన్ అని అంటారు. పంది కిడ్నీలు బ్రెయిన్ డెడ్ పేషెంట్లకు గతంలో మార్పిడి చేశారు. అయితే స్లేమాన్ దానిని స్వీకరించిన మొదటి వ్యక్తి. అవయవ దాతలుగా ఉపయోగించే పందులను మానవ గ్రహీతలకు హాని కలిగించే ఇన్ఫెక్షన్లకు గురికాకుండా ఉండేందుకు ప్రత్యేక పరిస్థితుల్లో ఒంటరిగా పెంచుతారు. ఈ ప్రత్యేక పందులలో మానవ అవయవాలకు సమానమైన పరిమాణం, పనితీరు కలిగిన అవయవాలు వృద్ధి చెందుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.