AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP DSC 2024 Update: ఏపీ టెట్‌ 2024 ఫలితాలకు బ్రేక్.. ఇరకాటంలో డీఎస్సీ పరీక్ష నిర్వహణ! ఏం జరుగుతుందో..?

రాష్ట్ర డీఎస్సీ అభ్యర్ధుల గోస పట్టించుకునే నాథుడేలేడు. ఓ వైపు ఎన్నికలు.. మరోవైపు ప్రిపరేషర్‌.. రెండిటినీ సజావుగా నిర్వహించలేక అడకత్తెరలో పోకచెక్కలా నిరుద్యోగులు నలిగిపోతున్నారు. ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు కోరుతూ హైకోర్టును సంప్రదించగా ప్రభుత్వ విధాన నిర్ణయమని, అందులో జోక్యం చేసుకోలేమని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తులు వెళ్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి..

AP DSC 2024 Update: ఏపీ టెట్‌ 2024 ఫలితాలకు బ్రేక్.. ఇరకాటంలో డీఎస్సీ పరీక్ష నిర్వహణ! ఏం జరుగుతుందో..?
State Chief Electoral Officer (ceo) Mukesh Kumar Meena
Srilakshmi C
|

Updated on: Mar 21, 2024 | 8:58 AM

Share

అమరావతి, మార్చి 21: రాష్ట్ర డీఎస్సీ అభ్యర్ధుల గోస పట్టించుకునే నాథుడేలేడు. ఓ వైపు ఎన్నికలు.. మరోవైపు ప్రిపరేషర్‌.. రెండిటినీ సజావుగా నిర్వహించలేక అడకత్తెరలో పోకచెక్కలా నిరుద్యోగులు నలిగిపోతున్నారు. ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు కోరుతూ హైకోర్టును సంప్రదించగా ప్రభుత్వ విధాన నిర్ణయమని, అందులో జోక్యం చేసుకోలేమని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తులు వెళ్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేష్‌ కుమార్‌ మీనా కీలక ప్రకటన వెలువరించారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లభించిన తర్వాతే డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అంతవరకు టెట్‌ పరీక్షల ఫలితాలను కూడా ప్రకటించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు బుధవారం (మార్చి 20) సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డీఎస్‌సీలో 6,100 పోస్టులకు గానూ దాదాపు 4.72 లక్షల మంది పోటీపడుతున్నట్లు ఆయన తెలిపారు. డీఎస్సీ నిర్వహించాలని కొందరు మెసేజ్‌లు పెడుతుంటే, మరికొందరేమో వాయిదా కోరుతూ మెయిల్స్, ఫోన్‌ కాల్స్‌, మెజేస్‌ల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. డీఎస్సీ పరీక్ష నిర్వహణకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఈసీకి లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే సీఎస్‌ ఆధ్వర్యంలో ఇందుకు ఓ స్క్రీనింగ్‌ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై డీఎస్సీ భవితవ్యం ఆధారపడి ఉందని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం డీఎస్సీ నిర్వహించమంటే నిర్వహిస్తామని, లేదంటే వాయిదా వేస్తామని ఆయన స్పష్టం చేశారు.

కాగా ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. గత మూడు రోజుల్లో దాదాపు రూ.3.39 కోట్ల విలువైన నగదు, వివిధ వస్తువులను తనిఖీల్లో భాగంగా జప్తు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేష్‌ కుమార్‌ మీనా వెల్లడించారు. కోడ్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ కోడ్‌ను ఉల్లంఘించిన వారిపై 385 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, 46 మందిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అందులో 40 మంది గ్రామ సచివాలయ వలంటీర్లు ఉన్నారని, వారిని విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. వీరితోపాటు మరో ఇద్దరు రెగ్యులర్‌ ఉద్యోగులను సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్‌ అనుమతి లేకుండా ఓట్ల ప్రచారం కోసం ఆస్తులను వినియోగించిన వారిపై 94 కేసులు నమోదు చేశామన్నారు. ఇక ప్రభుత్వ ఆస్తులను, వాహనాలను దుర్వినియోగం చేసినందుకు గానూ 37 కేసులు నమోదు చేశామన్నారు. అక్రమ మద్యం అమ్మకాలు గానీ, అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలు ఏవీ జరగలేదని సీఈవో) ముఖేష్‌ కుమార్‌ మీనా మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.