AP High Court: ‘ఏపీ డీఎస్సీ 2024 ప్రక్రియ నిలిపివేయలేం.. ప్రభుత్వ విధాన నిర్ణయంలో జోక్యం చేసుకోలేం’: హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన డీఎస్సీ పోస్టుల నోటిఫికేషన్‌ వివాదాలకు నిలయంగా మారింది. ఇప్పటికే ఒకసారి డీఎస్సీ పరీక్షను వాయిదా పడింది కూడా. అయితే వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరోమారు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చేపట్టిన డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలంటూ కొందరు అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటీషన్లను విచారించిన న్యాయస్థానం డీఎస్సీ ప్రక్రియను..

AP High Court: 'ఏపీ డీఎస్సీ 2024 ప్రక్రియ నిలిపివేయలేం.. ప్రభుత్వ విధాన నిర్ణయంలో జోక్యం చేసుకోలేం': హైకోర్టు
AP High Court
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 21, 2024 | 8:33 AM

అమరావతి, మార్చి 21: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన డీఎస్సీ పోస్టుల నోటిఫికేషన్‌ వివాదాలకు నిలయంగా మారింది. ఇప్పటికే ఒకసారి డీఎస్సీ పరీక్షను వాయిదా పడింది కూడా. అయితే వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరోమారు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చేపట్టిన డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలంటూ కొందరు అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటీషన్లను విచారించిన న్యాయస్థానం డీఎస్సీ ప్రక్రియను నిలుపుదల చేసేందుకు నిరాకరించింది.

డీఎస్సీ విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని, ఉపాధ్యాయుల నియామకం అనేది పూర్తిగా ప్రభుత్వ విధాన నిర్ణయమని కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని వ్యాఖ్యానించింది. ఇప్పటికిప్పుడు హడావుడిగా పిటిషన్‌ దాఖలు చేసి, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరితే ఎలా అంటూ పిటిషనర్‌ను కోర్టు ప్రశ్నించింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసిన జీవోలను ఇప్పుడు సవాలు చేయడం ఏంటని సందేహం వ్యక్తం చేసింది. మధ్యంతర ఉత్తర్వులు కావాలంటే ముందే కోర్టుకొచ్చి ఉండాల్సి ఉందని అభిప్రాయపడింది. ఉపాద్యాయ పోస్టుల భర్తీ, వారి అర్హతలు వంటి తదితర విషయాలకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను మే 1కి వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు బుధవారం (మార్చి 20) ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.