AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohan Babu: ‘ఎన్నికల్లో డబ్బు ఇస్తే తీసుకోండి, అది మన డబ్బే.. కానీ ఆలోచించి ఓటు వేయండి’.. మోహన్‌ బాబు వైరల్ కామెంట్స్

తెలుగు ఇండస్ట్రీలో తొలుత అసిస్టెంట్ డైరెక్టర్‌గా.. ఆ తరువాత విలన్‌గా, కమీడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా.. ఇలా అంచలంచలుగా ఎదిగి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు 72వ పడిలో అడుగు పెట్టారు. మార్చి 19న ఆయన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తన కెరీర్‌లో ఆణిముత్యాల్లాంటి ఎన్నో విలక్షల సినిమాల్లో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు..

Mohan Babu: 'ఎన్నికల్లో డబ్బు ఇస్తే తీసుకోండి, అది మన డబ్బే.. కానీ ఆలోచించి ఓటు వేయండి'.. మోహన్‌ బాబు వైరల్ కామెంట్స్
Actor Mohan Babu
Srilakshmi C
|

Updated on: Mar 20, 2024 | 7:28 AM

Share

తెలుగు ఇండస్ట్రీలో తొలుత అసిస్టెంట్ డైరెక్టర్‌గా.. ఆ తరువాత విలన్‌గా, కమీడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా.. ఇలా అంచలంచలుగా ఎదిగి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు 72వ పడిలో అడుగు పెట్టారు. మార్చి 19న ఆయన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తన కెరీర్‌లో ఆణిముత్యాల్లాంటి ఎన్నో విలక్షల సినిమాల్లో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో హీరో అవ్వాలి అంటే ఎంతో కష్టంగా ఉండేది. పర్సనాలిటీ ఉన్నా, డైలాగులు అలవోకగా చెప్పగలిగినా.. అదృష్టం కలిసి రావడానికి ఎంతో టైం పట్టేది. మోహన్ బాబు కూడా ఎంతో కష్టపడి కింద స్థాయి నుంచి అడుగులో అడుగు వేసుకుంటూ హీరోగా ఎదిగారు.

తాజాగా మోహన్‌బాబు యూనివర్సిటీ 32వ వార్షికోత్సవంలో పాల్గొన్న మంచు మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సినిమాలు తీసి కొంత డబ్బులు పోగొట్టుకున్నాను. మలయాళంలో ఒక ఛాన్స్ ఇప్పించండని మోహన్ లాల్‌ను అడుగుతున్నాను. అది కూడా విలన్ పాత్ర మాత్రమే కావాలి. శరీరం శాశ్వతం కాదు శరీరంపై వ్యామోహం ఉండ కూడదు. ఎవరికైనా మనం దానం చేస్తే ప్రతిఫలంగా ఏమీ ఆశించకూడదు. సినిమాల్లో ఎంతో కాలం ఉండలేము. ప్రతి దానికి రిటైర్మెంట్ ఉంటుంది. అందుకోసమే కల్మషం లేని పిల్లలతో గడుపుతాను.

‘ఒక ఇడ్లీ తింటే చాలు అనుకున్న పాత రోజులు ఇంకా నాకు గుర్తు ఉన్నాయి. ప్రముఖ గాయకుడు గద్దర్ నా తమ్ముడు, గద్దర్ కుమార్తె ఇక్కడే చదివింది. మోహన్ బాబు మాకు అన్నం పెట్టి చదివించారని గద్దర్ కూతురు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. చదువు కంటే క్యారక్టర్ ముఖ్యం. శ్రీ విద్యానికేతన్ నుంచి ఎందరో IPS, IAS గా ఎన్నో డిపార్ట్మెంట్‌లలో ఉద్యోగాలు సంపాదించారు. మనోజ్ చెప్పినట్లు ఓటు కోసం అందరూ ఎర వేస్తారు. రాష్ట్ర రాజకీయాలు మాట్లాడను. వచ్చే ఎన్నికల్లో దేశంలో మళ్ళీ ప్రధానిగా మోదీ రావాలి. ప్రధాని నరేంద్ర మోడీని ఎన్నో సందర్భాల్లో కలిశాను. అలాంటి ఆలోచనలు, విధానాలు కలిగిన వ్యక్తి భారతదేశానికి అవసరం. ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. ఇరు పక్షాల వారూ డబ్బులు ఇస్తారు. ఆ డబ్బు మనదే. లంచాలు తీసుకొన్న మన డబ్బే తిరిగి ఓట్ల కోసం మనకు ఇస్తారు. కాబట్టి ఆ డబ్బు తీసుకోండి. ఓటు మాత్రం నచ్చిన వారికి వేసి, భారతదేశ భవిష్యత్తు ముందుకు వెళ్లడానికి సహకరించండి. కాబట్టి ఆలోచించి ఓటు వేయండి..’ అని నటుడు మోహన్ బాబు అన్నారు. కాగా మోహన్‌బాబు యూనివర్సిటీ 32వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా ప్రముఖ మళయాళ నటుడు మోహన్ లాల్, ఆర్టిస్ట్ ముఖేష్ రిషి హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.