Pooja Hegde: పబ్లిక్‌లో భర్తతో జెనీలియా సరసాలు.. పూజా జెలసీతో ఏం చేసిందంటే
కొంతమంది మాత్రం ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్స్ గా మారిపోతున్నారు. అలాగే పూజా హెగ్డే కూడా ఒకొక్క మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ గా మారింది. ఒకలైలా సినిమా తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ చిన్నది ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. యంగ్ హీరోల సరసన హీరోయిన్ గా మెప్పించిన పూజాహెగ్డే..
ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించడం అంత ఈజీ కాదు.. కొంతమంది చాలా కష్టపడి హీరోయిన్స్ గా సినిమాలు చేసి టాప్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కొంతమంది మాత్రం ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్స్ గా మారిపోతున్నారు. అలాగే పూజా హెగ్డే కూడా ఒకొక్క మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ గా మారింది. ఒకలైలా సినిమా తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ చిన్నది ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. యంగ్ హీరోల సరసన హీరోయిన్ గా మెప్పించిన పూజాహెగ్డే.. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ ఇలా బడా హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించింది. కానీ ఇప్పుడు ఈ చిన్నదాని స్పీడ్ కు బ్రేకులు పడ్డాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన సినిమాలన్నీ ఈ మధ్యకాలంలో బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.
దాంతో పూజాహెగ్డే కు ఆఫర్స్ కరువయ్యాయి. ప్రస్తుతం ఈ చిన్నదాని చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా పూజా హెగ్డే చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పబ్లిక్‌లో భర్తతో జెనీలియా సరసాలు ఆడుతుండగా పూజా షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది.
ముంబైలోని ఓ ఈవెంట్ కు స్టార్ సెలబ్రెటీలు వచ్చారు. అలాగే జెనీలియా, ఆమె భర్త రితేష్ దేశముఖ్ కూడా హాజరయ్యారు. అయితే ఈ జంట ఎప్పుడు చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటారు. అలాగే ఈ ఈవెంట్ లోనూ జెనీలియా తన భర్తతో సరసాలు ఆడింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన పూజా హెగ్డే వీరిని చూసి .. ఏం పట్టనట్టు వెళ్ళిపోయింది. వాళ్ల వైపు ఓర కంటితో చూస్తూ .. క్రేజీ రియాక్షన్ ఇచ్చింది పూజా హెగ్డే. ఆతర్వాత పూజను చూసి షాక్ అయ్యింది జెనీలియా..ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫన్నీ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.
పూజా హెగ్డే ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.