AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mrunal Thakur: కంటి నిండా నిద్రపోయి చాలా రోజులైంది.. అందుకే చేస్తున్నా

సీతారామం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన మృణాల్ ఠాకూర్ మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. హనురాఘవాపుడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో మృణాల్ కు మంచి పేరొచ్చింది. సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించింది ఈ చిన్నది. సీతారామం సినిమా తర్వాత నేచురల్ స్టార్ నాని సరసన నటించే ఛాన్స్ అందుకుంది.

Mrunal Thakur: కంటి నిండా నిద్రపోయి చాలా రోజులైంది.. అందుకే చేస్తున్నా
Mrunal
Rajeev Rayala
|

Updated on: Mar 20, 2024 | 7:22 AM

Share

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చిన ముద్దుగుమ్మలు చాలా మంది తమ సత్తా చాటారు. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకొని మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. కానీ అందరు బామలు ఇక్కడ సెటిల్ అవ్వలేకపోయారు. దాంతో తిరిగి బాలీవుడ్ కు చెక్కేశారు. కానీ ఈ బ్యూటీ మాత్రం ఆచి తూచి అడుగులేస్తూ సినిమాలు చేస్తోంది. ఆ ముద్దుగుమ్మే మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన మృణాల్ ఠాకూర్ మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. హనురాఘవాపుడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో మృణాల్ కు మంచి పేరొచ్చింది. సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించింది ఈ చిన్నది. సీతారామం సినిమా తర్వాత నేచురల్ స్టార్ నాని సరసన నటించే ఛాన్స్ అందుకుంది.

నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాలో నటించింది మృణాల్. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. హాయ్ నాన్న సినిమాలో నానితో పోటీ పడి మరీ నటించింది మృణాల్. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే తాజాగా మృణాల్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతోంది. నేను కంటినిండా నిద్రపోయి చాలా రోజులు అయ్యింది అంటుంది మృణాల్. అసలు విషయం ఏంటంటే మృణాల్ ప్రస్తుతం వెకేషన్ లో ఉంది. ఆమె మాట్లాడుతూ.. వరుస షూటింగ్స్ తో బిజీగా మారిపోయాను. దాదాపు రెండేళ్లుగా బిజీగా గడుపుతున్నా.. ఎంత బిజీగా ఉన్న చిన్న చిన్న విరామాలు, ఫ్యామిలీతో గడిపే క్షణాలు చాలా అవసరం అని తెలిపింది మృణాల్. అందుకే ఇప్పుడు షూటింగ్ నుంచి విరామం తీసుకొని కుటుంబంతో సమయం గడుపుతున్నా అని తెలిపింది. విరామం తీసుకోవడం వల్ల సినిమాల ఎంపికలోనూ మంచి అడుగులేస్తాం.. లేదంటే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం అని చెప్పుకొచ్చింది మృణాల్.

మృణాల్ ఠాకూర్..

మృణాల్ ఠాకూర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?