Andhra Pradesh: బస్సుల్లేక ‘టెన్త్‌’ విద్యార్ధుల అగచాట్లు.. తికమకలో మరో కేంద్రానికి వెళ్లిన విద్యార్థిని

సోమవారం నుంచి ఏపీలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అవస్థలు తప్పడం లేదు. సరైన బస్సు సౌకర్యం లేని దూర ప్రాంతాల నుంచి రాలేక విద్యార్థులు తంటాలు పడుతున్నారు. దీంతో ఆటోలు, ద్విచక్ర వాహనాలపై కేంద్రాలకు చేరుకున్నారు. ఒక్కో ఆటోలో సుమారు 15 మందికి పైగా ప్రయాణిస్తున్నారు..

Andhra Pradesh: బస్సుల్లేక 'టెన్త్‌' విద్యార్ధుల అగచాట్లు.. తికమకలో మరో కేంద్రానికి వెళ్లిన విద్యార్థిని
SSC Students
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 19, 2024 | 9:33 AM

దేవరాపల్లి, మార్చి 19: సోమవారం నుంచి ఏపీలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అవస్థలు తప్పడం లేదు. సరైన బస్సు సౌకర్యం లేని దూర ప్రాంతాల నుంచి రాలేక విద్యార్థులు తంటాలు పడుతున్నారు. దీంతో ఆటోలు, ద్విచక్ర వాహనాలపై కేంద్రాలకు చేరుకున్నారు. ఒక్కో ఆటోలో సుమారు 15 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. కిక్కిరిసిన ఆటోల్లో బాలికలు సైతం వెనుక భాగంలో కూర్చుని ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించడం ఆందోళన కలిగిస్తోంది. అధికారులు స్పందించి కనీసం పరీక్ష సమయంలోలైన బస్సులు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

కాగా మార్చి 18న జరిగిన పదో తరగతి తొలి పరీక్షకు ఓ విద్యార్ధిని నానా కష్టాలు పడింది. దేవరాపల్లి మండలం తెనుగుపూడి కేంద్రంలో పరీక్ష రాయాల్సి ఉండగా.. ఓ విద్యార్థిని పొరబాటున దేవరాపల్లి కేంద్రానికి వెళ్లింది. దీంతో అక్కడే ఉన్న ఎస్సై నాగేంద్ర వెంటనే స్పందించి.. తెనుగుపూడి కేంద్రానికి వెళ్లాలని సూచించారు. అంతేకాకుండా మహిళా కానిస్టేబుల్‌ చంద్రకళతో ఆ విద్యార్థినిని స్కూటీపై పరీక్ష కేంద్రానికి సకాలంలో తీసుకెళ్లారు. దీంతో అంతా ఊపిరి తీసుకున్నారు.

అయిదు పదుల వయసులోనూ పది పరీక్షకు హాజరైన మహిళామణి

చదువుకోవాలనే కోరిక ఉండాలే కాని అందుకు వయసు అడ్డుకాదని మరోమారు నిరూపితమైంది. గుమ్మలక్ష్మీపురం మండలంలోని మూలపాడుకు చెందిన పెద్దమ్మి వయసు 53 ఏళ్లు. ఈ వయసులోనూ చదువుకోవాలనే తపన ఆమెను పదో తరగతి పరీక్షలకు హాజరయ్యేలా చేసింది. దీంతో సోమవారం నుంచి ప్రారంభమైన పదో తరగతి సార్వత్రిక పరీక్ష రాసేందుకు ఆమె భద్రగిరి ఏపీఆర్‌ కేంద్రానికి వచ్చారు. చిన్న తనంలో పలు కారణాల వల్ల చదువుకోలేకపోయానని, ఏడో తరగతిలో చదువు మానేశానని చెప్పుకొచ్చారు. ఆసక్తి ఉండటంతో ఇన్నాళ్లకు మళ్లీ పరీక్షలు రాసే అవకాశం దక్కిందని పెద్దమ్మి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.