AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మియాపూర్‌లో చెడ్డీ గ్యాంగ్‌ కలకలం.. ప్రైవేట్‌ స్కూల్‌లో రూ.8 లక్షల చోరీ! వీడియో వైరల్

నగరంలో చెడ్డీగ్యాంగ్ చోరీలు మారోమారు కలకలం సృష్టించాయి. మియాపూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ స్కూల్‌లో చెడ్డీ గ్యాంగ్‌ శనివారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. బ్లాక్‌ చెడ్డీలు ధరించి మారణాయుధాలతో ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో ప్రవేశించిన దుండగులు పాఠశాల కార్యాలయంలోని కౌంటర్‌లో ఉన్న దాదాపు 8 లక్షల నగదు చోరీ చేశారు. చోరికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌..

Hyderabad: మియాపూర్‌లో చెడ్డీ గ్యాంగ్‌ కలకలం.. ప్రైవేట్‌ స్కూల్‌లో రూ.8 లక్షల చోరీ! వీడియో వైరల్
Cheddi Gang
Srilakshmi C
|

Updated on: Mar 18, 2024 | 7:48 AM

Share

హైదరాబాద్‌, మార్చి 18: నగరంలో చెడ్డీగ్యాంగ్ చోరీలు మారోమారు కలకలం సృష్టించాయి. మియాపూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ స్కూల్‌లో చెడ్డీ గ్యాంగ్‌ శనివారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. బ్లాక్‌ చెడ్డీలు ధరించి మారణాయుధాలతో ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో ప్రవేశించిన దుండగులు పాఠశాల కార్యాలయంలోని కౌంటర్‌లో ఉన్న దాదాపు 8 లక్షల నగదు చోరీ చేశారు. చోరికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. వివరాల్లోకెళ్తే..

హఫీజ్‌పేట్‌లోని వరల్డ్ వన్ ప్రైవేటు స్కూల్‌లో శనివారం (మార్చి 17) అర్ధరాత్రి కొందరు దుండగులు చోరీకి పాల్పడ్డారు. చెడ్డీలు ధరించి, ముఖాలకు ముసుగు ధరించి మారణాయుధాలతో వచ్చిన చెడ్డీ గ్యాంగ్ ముఠా స్కూల్ కార్యాలయంలోని కౌంటర్‌లో రూ.7.85 లక్షల నగదును దోచుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఒంటి మీద దుస్తులు లేకుండా కేవలం చెడ్డీలతో వచ్చిన ఈ గ్యాంగ్‌ పాఠశాల కార్యాలయంలో సంచరించడం వీడియోలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు మియాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజీలను పోలీసులకు సమర్పించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది చెడ్డీ గ్యాంగ్ పనేనని, త్వరలో వారిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. కాగా గతంలోనూ ఒకట్రెండు చోట్ల చెడ్డీ గ్యాంగ్ చోరీలు నగరంలో చోటు చేసుకున్నాయి. తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ సంచరించడం నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
గోల్డ్ లోన్లకు ఎందుకంత క్రేజ్? ఇప్పుడు వాళ్లు కూడా బంగారం తాకట్టు
గోల్డ్ లోన్లకు ఎందుకంత క్రేజ్? ఇప్పుడు వాళ్లు కూడా బంగారం తాకట్టు
గోల్డ్ మెడల్ కోసం పోరు.. మరికొద్దిసేపట్లో మ్యాచ్..
గోల్డ్ మెడల్ కోసం పోరు.. మరికొద్దిసేపట్లో మ్యాచ్..
ఆదిలాబాద్ రిమ్స్‌‌లో ఘోర ప్రమాదం.. ఏసీ పేలి ఇద్దరు చిన్నారుల మృతి
ఆదిలాబాద్ రిమ్స్‌‌లో ఘోర ప్రమాదం.. ఏసీ పేలి ఇద్దరు చిన్నారుల మృతి
అడ్వాన్స్ బుకింగ్స్‏లో ది ప్యారడైజ్ విధ్వంసం..
అడ్వాన్స్ బుకింగ్స్‏లో ది ప్యారడైజ్ విధ్వంసం..
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌