Cotton Candy Banned: పీచు మిఠాయిపై మరో రాష్ట్రంలోనూ నిషేధం.. కారణం ఇదే!

పీచు మిఠాయి గురించి తెలియని వారుండరు. ఇదోరకమైన చక్కెర మిఠాయి. పీచులా ఉండటం వల్ల దానికి పీజు మిఠాయి అనే పేరు వచ్చింది. అలా నోట్లో వేసుకోగానే క‌రిగిపోయే ఈ పీచు పిఠాయిని పిల్లలతోపాటు పెద్దలు కూడా ఆస‌క్తి చూపుతారు. ఎంతో ఇష్టంగా తినే పీచు మిఠాయిపై ఇటీవల పలు రాష్ట్రాలు నిషేధం విధిస్తున్నాయి. పీచు మిఠాయి తయారీకి ఉప‌యోగించే రంగుల్లో క్యాన్సర్‌కార‌క ర‌సాయ‌నాలు ఉన్నట్లు ప‌రిశోధ‌న‌ల్లో తేలింది..

Cotton Candy Banned: పీచు మిఠాయిపై మరో రాష్ట్రంలోనూ నిషేధం.. కారణం ఇదే!
Cotton Candy
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 17, 2024 | 7:51 PM

సిమ్లా, మార్చి 17: పీచు మిఠాయి గురించి తెలియని వారుండరు. ఇదోరకమైన చక్కెర మిఠాయి. పీచులా ఉండటం వల్ల దానికి పీజు మిఠాయి అనే పేరు వచ్చింది. అలా నోట్లో వేసుకోగానే క‌రిగిపోయే ఈ పీచు పిఠాయిని పిల్లలతోపాటు పెద్దలు కూడా ఆస‌క్తి చూపుతారు. ఎంతో ఇష్టంగా తినే పీచు మిఠాయిపై ఇటీవల పలు రాష్ట్రాలు నిషేధం విధిస్తున్నాయి. పీచు మిఠాయి తయారీకి ఉప‌యోగించే రంగుల్లో క్యాన్సర్‌కార‌క ర‌సాయ‌నాలు ఉన్నట్లు ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. దీంతో వీటి విక్రయాలపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఇప్పటికే నిషేధం విధించాయి. ఇక తాజాగా హిమాచల్‌ ప్రదేశ్‌కూడా ఈ పీచుమిఠాయిని నిషేధించింది. ప్రజారోగ్యం దృష్ట్యా దీని తయారీ, నిల్వ, పంపిణీ, విక్రయాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదిపాటు నిషేధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏడాది పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం మార్చి 15, 2024 నుంచి మే 15, 2025 వరకూ ఈ నిబంధన అమల్లో ఉంటుందని తెలిపింది.

రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సేకరించిన పీచు మిఠాయి నమూనాలను పరీక్షించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు వీటిలో ప్రమాదకర రంగులు కలుపుతున్నట్లు గుర్తించారు. ఆహార భద్రత ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు. దీంతో FSSA 2006 చట్టం (ఆహార భద్రత – ప్రమాణాల చట్టం)లోని సెక్షన్ 30 ప్రకారం రాష్ట్రంలో ఏడాది పాటు పీచు మిఠాయి ప్యాకేజ్ చేయడం, నిల్వ చేయడం, పంపిణీ చేయడం, అమ్మడంపై నిషేధం విధించినట్లు కమీషనర్ (ఫుడ్ సేఫ్టీ) కమ్ సెక్రటరీ (ఆరోగ్యం) తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రజారోగ్యానికి ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యంపై ఇవి తీవ్ర దుష్ప్రభావం చూపుతాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో వీటి విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇటువంటి ప్రమాదకర పీచు మిఠాయిల వినియోగం మానవ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఈ ఆహార పదార్థాల వినియోగాన్ని నిషేధించకుండా అనుమతించినట్లయితే ప్రస్తుత, భవిష్యత్తు తరాల శ్రేయస్సు ప్రమాదంలో పడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్