Hyderabad: డబ్బుపై మోజుతో చీకటి దందా.. 8 ఏళ్లలో రూ.4 కోట్ల ఆస్తులు కూడబెట్టిన నీతూబాయి!

ఓ మామూలు కిరాణ దుకాణం నిర్వహించే మహిళ బ్యాంకు ఖాతాలో కోట్ల రూపాయల నగదుతోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు ఉండటం తెలంగాణ న్యాబ్‌ పోలీసులు గుర్తించారు. ఇంత పెద్ద మొత్తంలో ఎలా సంపాధించిందో తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విచారణలో విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. ఏకంగా గంజాయి దందా నిర్వహిస్తోన్న కిరాణా కొట్టు మహిళ కేవలం ఎనిమిదేళ్లలో..

Hyderabad: డబ్బుపై మోజుతో చీకటి దందా.. 8 ఏళ్లలో రూ.4 కోట్ల ఆస్తులు కూడబెట్టిన నీతూబాయి!
Ganja Queen In Hyderabad
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 15, 2024 | 6:31 PM

హైదరాబాద్‌, మార్చి 15: ఓ మామూలు కిరాణ దుకాణం నిర్వహించే మహిళ బ్యాంకు ఖాతాలో కోట్ల రూపాయల నగదుతోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు ఉండటం తెలంగాణ న్యాబ్‌ పోలీసులు గుర్తించారు. ఇంత పెద్ద మొత్తంలో ఎలా సంపాధించిందో తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విచారణలో విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. ఏకంగా గంజాయి దందా నిర్వహిస్తోన్న కిరాణా కొట్టు మహిళ కేవలం ఎనిమిదేళ్లలో భారీగా కూడబెట్టినట్లు గుర్తించారు. టీఎస్‌ న్యాబ్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య తెలిపిన వివరాల ప్రకారం..

హైదారబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో నివసిస్తోన్న నీతూబాయి సాదాసీదా కిరణా దుఖానం నడిపిస్తోంది. అయితే ఆమె బ్యాంకు ఖాతాలో రూ.1.63 కోట్ల నగదు, హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో రూ.2 కోట్ల విలువైన స్థిరాస్థులు ఉన్నట్లు తెలంగాణ న్యాబ్‌ పోలీసులు గుర్తించారు. నీతూబాయి కుటుంబ నేపథ్యం ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో న్యాబ్‌ అధికారులు డెకాయ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. దర్యాప్తులో పోలీసులకు షాకింగ్‌ విషయాలు తెలిశాయి. గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయాలు సాగిస్తోన్న నీతూబాయి.. కుటుంబ సమేతంగా ఎనిమిదేళ్లలో ఇలా అడ్డగోలుగా సంపాదించినట్లు వెల్లడించారు. దీంతో నీతూబాయి, ఆమె భర్త మున్నుసింగ్‌ (53), సమీప బంధువులు సురేఖ (38), మమత (50)తోపాటు13 మంది గంజాయి వినియోగదారులతో కలిపి మొత్తం 17 మందిని బుధవారం (మార్చి 13) అరెస్టు చేశారు. మరో ముగ్గురు.. ధూల్‌పేటకు చెందిన అంగూరిబాయి, నానక్‌రాంగూడకు చెందిన గౌతమ్‌సింగ్‌, నేహాబాయి పరారీలో ఉన్నారు. అరెస్టయిన వారి నుంచి రూ.22.10 లక్షల నగదు, 22.6 కిలోల గంజాయి, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు టీఎస్‌ న్యాబ్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య గురువారం మీడియాకు తెలిపారు.సులువుగా డబ్బు సంపాదించేందుకు నీతూబాయి, మున్నుసింగ్‌తోపాటు ఇతర కుటుంబసభ్యులు గంజాయి విక్రయాలు మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు.

వీరి వ్యాపారం అలా మొదలైంది..

ధూల్‌పేటకు చెందిన అంగూరిబాయి వీరికి ప్రధాన సప్లైదారు. అంగూరిబాయి నుంచి కిలో గంజాయి రూ.8 వేల చొప్పున కొనుగోలు చేసి 5 గ్రాముల చొప్పున చిన్న పొట్లాల్లో నింపేవారు. ఒక్కోపొట్లం రూ.500 విక్రయించేవారు. అలా కిలో గంజాయికి రూ.50 వేలు వరకు సంపాదించేవారు. అలా వచ్చిన విలాసవంత జీవితం గడుపుతున్నారు. ఖరీదైన ఇళ్లు, ఆస్థులు కూడబెట్టారు. గతేడాది ఆగస్టులో నీతూబాయికి రూ.4 కోట్ల ఆస్తులున్నట్లు గుర్తించిన పోలీసులు.. ఎన్‌డీపీఎస్‌ చట్టం ప్రకారం స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత కూడా ఆమె గంజాయి విక్రయాలు కొనసాగిస్తూనే ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.