Telangana TET 2024: టెట్ నిర్వహణకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. డీఎస్సీకి ముండే టెట్ పరీక్ష
మెగా డీఎస్సీకి ముందే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు డీఎస్సీకి ముందే టెట్ నిర్వహించాలని గురువారం (మార్చి 14) విద్యా శాఖ కమిషనర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 3 లక్షల మంది అభ్యర్ధులకు లబ్ధి చేకూరనుంది. దీంతో త్వరలో టెట్ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యాశాఖ జారీ చేసే అవకాశం ఉంది..
హైదరాబాద్, మార్చి 14: మెగా డీఎస్సీకి ముందే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు డీఎస్సీకి ముందే టెట్ నిర్వహించాలని గురువారం (మార్చి 14) విద్యా శాఖ కమిషనర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 3 లక్షల మంది అభ్యర్ధులకు లబ్ధి చేకూరనుంది. దీంతో త్వరలో టెట్ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యాశాఖ జారీ చేసే అవకాశం ఉంది. టెట్ నిర్ణహణ ద్వారా వీలైనంత ఎక్కువ మందికి డీఎస్సీ రాసే అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం తాజాగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే డీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుంది. టెట్ నిర్వహించిన తర్వాతే డీఎస్సీ నిర్వహించాలని డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగులతోపాటు బీఆర్ఎస్ నాయకులు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే విషయమై మాజీ మంత్రి హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌కు బహిరంగ లేఖ కూడా రాశారు. టెట్ నిర్వహించకపోవడం వల్ల అనేక మంది నిరుద్యోగులు డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే అర్హతను కోల్పోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చివరి సారిగా గతేడాది సెప్టెంబర్‌లో టెట్ నిర్వహించారు. గత డిసెంబర్‌లో డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులు దాదాపు 50 వేల మంది వరకు ఉన్నారని, వీరందరికీ టెట్ నిర్వహిస్తే అర్హత సాధించిన వారందరూ డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో దిగివచ్చిన రేవంత్ సర్కార్ డీఎస్సీ కంటే ముందుగానే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది.
తెలంగాణ డీఎస్సీ మొత్తం ఉద్యోగాల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 727 భాషా పండితులు పోస్టులు, 182 పీఈటీ పోస్టులు, 6,508 ఎస్జీటీ పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. అత్యధిక పోస్టులు హైదరాబాద్‌లో 878 ఉన్నాయి. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 605 పోస్టులు, నిజామాబాద్‌లో 601 పోస్టులు, ఖమ్మంలో 757 పోస్టులు, సంగారెడ్డిలో 551 పోస్టులు, కామారెడ్డిలో 506 పోస్టులు ఉన్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.