Viral Video: రోగిలా ముఖం కప్పుకుని సర్కార్ ఆస్పత్రికెళ్లిన లేడీ ఐఏఎస్‌.. తనిఖీల్లో నిలువెత్తు అవినీతి బట్టబయలు! వీడియో వైరల్

ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాకంపై వరుస ఫిర్యాదులు అందడంతో రహస్యంగా తనిఖీ చేయాలని ఓ ఐఏఎస్‌ అధికారిణి నిర్ణయించుకున్నారు. ముఖం కప్పుకుని రోగి మాదిరిగా, ఆ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి.. ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడి సిబ్బందికి షాక్‌ ఇచ్చింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ జిల్లాలో జరిగింది. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లోని దీదా మాయి ఆరోగ్య కేంద్రంలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, అసౌకర్యాలపై ఆ జిల్లా కలెక్టరేట్‌కు..

Viral Video: రోగిలా ముఖం కప్పుకుని సర్కార్ ఆస్పత్రికెళ్లిన లేడీ ఐఏఎస్‌.. తనిఖీల్లో నిలువెత్తు అవినీతి బట్టబయలు! వీడియో వైరల్
IAS officer Kriti Raj
Follow us

|

Updated on: Mar 13, 2024 | 8:06 PM

లక్నో, మార్చి 13: ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాకంపై వరుస ఫిర్యాదులు అందడంతో రహస్యంగా తనిఖీ చేయాలని ఓ ఐఏఎస్‌ అధికారిణి నిర్ణయించుకున్నారు. ముఖం కప్పుకుని రోగి మాదిరిగా, ఆ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి.. ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడి సిబ్బందికి షాక్‌ ఇచ్చింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ జిల్లాలో జరిగింది. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లోని దీదా మాయి ఆరోగ్య కేంద్రంలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, అసౌకర్యాలపై ఆ జిల్లా కలెక్టరేట్‌కు పలు ఫిర్యాదులు అందాయి. ఉదయం పది గంటలు దాటినప్పటికీ డాక్టర్లు అందులోబాటులో ఉండటం లేదని పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో ఆకస్మికంగా తనిఖీ చేయాలని ఆ జిల్లా డిప్యూటీ కలెక్టర్‌ కృతి రాజ్ నిర్ణయించారు.

ఈ క్రమంలో ఐఏఎస్ అధికారి కృతి రాజ్ బుధవారం (మార్చి 13) రోగి మాదిరి ముసుగు ధరించి ఆసుపత్రికి వెళ్లి.. అక్కడ డాక్టర్‌ చెకప్‌కు వెళ్లారు. అయితే డాక్టర్‌ ప్రవర్తన సరిగా లేకపోవడాన్ని అధికారిణి కృతి గ్రహించారు. అంతేకాకుండా అక్కడ ఆసుపత్రి మెడికల్ స్టాక్‌ స్టోర్‌లో చాలా మందులు గడువు ముగిసినవి ఉన్నట్లు గుర్తించారు. హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేయగా రిజిస్టర్‌లో కొందరి సంతకాలు ఉన్నా.. ఆ సిబ్బంది అక్కడ లేకపోవడం, విధుల్లో ఉన్న సిబ్బంది సేవల తీరు సరిగా లేకపోవడాన్ని ఆమె గుర్తించి, ఆగ్రహించారు. అసుపత్రి కూడా అపరిశుభ్రంగా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

తనిఖీ అనంతరం ఐఏఎస్‌ అధికారిణి కృతి మీడియాతో మాట్లాడుతూ.. కుక్క కాటుకు ఇంజెక్షన్ వేయడానికి ఉదయం 10 గంటల తర్వాత కూడా డాక్టర్ అందుబాటులో లేనట్లు దిదా మాయి ఆరోగ్య కేంద్రానికి సంబంధించి నాకు ఫిర్యాదు అందింది. నేను ముసుగులో అక్కడికి వెళ్ళాను. డాక్టర్‌ వద్దకు వెళ్లగా అతని ప్రవర్తన సరిగా లేదు. అంతేకాకుండా స్టాక్‌లో ఉన్న చాలా ఔషధాల గడువు ముగిసి ఉన్నాయి. పరిశుభ్రత కూడా సక్రమంగా నిర్వహించట్లేదని’ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితిపై త్వరలో నివేదిక పంపుతానని వెల్లడించారు.

కాగా, ఐఏఎస్‌ అధికారిణి కృతి ముఖానికి ముసుగు వేసుకుని, సాధారణ రోగి మాదిరిగా ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన వీడియో క్లిప్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మాజీ యుపీ సీఎం అఖిలేష్ యాదవ్ ఎస్‌డిఎమ్ తనిఖీ నిర్వహిస్తున్న ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. యూపీలో వైద్య మౌలిక సదుపాయాల స్థితిని ఎద్దేవా చేస్తూ బీజేపీ నేతృత్వంలోని యోగి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఈ ఆకస్మిక తనిఖీ తర్వాత ఐఏఎస్ అధికారిని బదిలీ అయ్యే అవకాశం ఉందని అఖిలేష్ యాదవ్ తన ఎక్స్ అకౌంట్‌లో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ వైద్య వ్యవస్థను తెరపైకి తెచ్చిన సాహసోపేతమైన మహిళా అధికారి జాగ్రత్తగా ఉండాలని, మందులు లేకుండా నడుస్తున్న రాష్ట్ర వైద్య వ్యవస్థలో అవినీతి వెలుగులోకి తీసుకొచ్చిన ఐఏఎస్ అధికారిని కృతిపై బదిలీ వేటు పడే అవకాశం ఉందన్నారు. కాలం చెల్లిన మందులతో రోగులను నయం చేస్తామని హామీ ఇచ్చే బీజేపీ ప్రభుత్వ హయాం గడువు దగ్గర పడిందని యోగి సర్కార్‌పై మండిపడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ