AP Inter Exams 2024: ఏపీ ఇంటర్‌ పరీక్షల్లో మాల్‌ ప్రాక్టీస్‌.. 22 మంది విద్యార్ధులపై కేసులు

Malpractice in AP Inter Exams 2024.. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు మార్చి 15వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో పలు చోట్ల విద్యార్ధులు మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ పట్టుబడుతున్నారు. మార్చి 11 (సోమవారం) నిర్వహించిన ఇంటర్మీడియట్‌ రెండో ఏడాది గణీతం 2బి, చరిత్ర పరీక్షల్లో 22 మంది విద్యార్ధులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. వీరందరిపై మాల్ ప్రాక్టీస్‌ కేసులు నమోదు..

AP Inter Exams 2024: ఏపీ ఇంటర్‌ పరీక్షల్లో మాల్‌ ప్రాక్టీస్‌.. 22 మంది విద్యార్ధులపై కేసులు
AP Inter Exams
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 12, 2024 | 5:27 PM

అమరావతి, మార్చి 12: తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు మార్చి 15వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో పలు చోట్ల విద్యార్ధులు మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ పట్టుబడుతున్నారు. మార్చి 11 (సోమవారం) నిర్వహించిన ఇంటర్మీడియట్‌ రెండో ఏడాది గణీతం 2బి, చరిత్ర పరీక్షల్లో 22 మంది విద్యార్ధులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. వీరందరిపై మాల్ ప్రాక్టీస్‌ కేసులు నమోదు చేసినట్లు ఇంటర్మీడియట్‌ విద్యామండలి వెల్లడించింది. కాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 11న నిర్వహించిన ఇంటర్మీడియట్‌ పరీక్షలకు 97 శాతం మంది విద్యార్ధులు హాజరయ్యారు. మొత్తం 3,89,743 మందికిగానూ 3,78,382 మంది విద్యార్ధులు హాజరైనట్లు బోర్డు వెల్లడించింది.

కాగా 2023-24 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో మొత్తం 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతున్నారు. వారిలో ఫస్ట్‌ ఇయర్‌ నుంచి 4,73,058 మంది, సెకండ్ ఇయర్‌ నుంచి 5,79,163 మంది విద్యార్ధులు పరీక్షలు రాస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల్లో 1,559 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షల్లో ఎలాంటి అవాంచిత సంఘటనలు చోటుచేసుకోకుండా సీసీ కెమెరాల నిఘాలో పకడ్భందీగా నిర్వహిస్తున్నారు. క్వశ్చన్‌ పేపర్ల లీకేజీలను అరికట్టేందుకు మూడు స్థాయిల్లో ‘క్యూఆర్‌’ కోడ్‌ను ముద్రించారు. దీంతో పేపర్‌ను ఎక్కడ ఫొటో తీసినా వెంటనే తెలిసిపోయేలా పటిష్ట ఏర్పాట్లు చేశారు.

అటు తెలంగాణలోనూ ఇదే మాదిరి గట్టి ఏర్పాట్లు చేసినా విద్యార్ధులు పలు చోట్ల మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ పట్టుబడుతున్నారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2024లో భాగంగా 9వ రోజున అంటే మార్చి 11 న జరిగిన ప్రథమ సంవత్సరం ఫిజిక్స్ 1, ఎకానమిక్స్ 1 పరీక్షల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 17 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదైనట్లు ఇంటర్‌ బోర్డ్ వెల్లడించింది. వీటిల్లో ములుగులో 12, సంగారెడ్డిలో 2, పెద్దపల్లిలో 1, జనగామలో 1, నిజామాబాద్‌లో 1 చొప్పున కేసులు నమోదైనట్లు బోర్డు తెలిపింది. మార్చి 11నాడు జరిగిన పరీక్షలకు 5,29,893 మంది నమోదు చేసుకోగా వారిలో 24,230 మంది గైర్హాజరయ్యారు. 5,05,663 మంది హజరయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ