APPSC Group 1 Exam: ఏపీపీఎస్సీ గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్య సూచనలు జారీ చేసిన కమిషన్!
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ప్రాథమిక (ప్రిలిమ్స్) పరీక్ష మార్చి 17న నిర్వహించనున్న సంగతి తెలిసిందే. గ్రూప్-1 స్క్రీనింగ్ టెస్టుకు సంబంధించి ముఖ్య సూచనలను తాజాగా ఏపీపీఎస్సీ జారీ చేసింది. ప్రాథమిక పరీక్ష ఓఎమ్మార్ సమాధాన పత్రం నకలు కాపీ, ప్రశ్నపత్రం ఫస్ట్ పేజీలతో పాటు అభ్యర్థులకు ముఖ్య సూచనలు జారీ చేసింది. పరీక్ష బుక్‌లెట్ సిరీస్ కోడ్, అనుసరించాల్సిన సూచనలను ఇందులో తెలియజేసింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కు హాజరయ్యే..
అమరావతి, మార్చి 12: ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ప్రాథమిక (ప్రిలిమ్స్) పరీక్ష మార్చి 17న నిర్వహించనున్న సంగతి తెలిసిందే. గ్రూప్-1 స్క్రీనింగ్ టెస్టుకు సంబంధించి ముఖ్య సూచనలను తాజాగా ఏపీపీఎస్సీ జారీ చేసింది. ప్రాథమిక పరీక్ష ఓఎమ్మార్ సమాధాన పత్రం నకలు కాపీ, ప్రశ్నపత్రం ఫస్ట్ పేజీలతో పాటు అభ్యర్థులకు ముఖ్య సూచనలు జారీ చేసింది. పరీక్ష బుక్‌లెట్ సిరీస్ కోడ్, అనుసరించాల్సిన సూచనలను ఇందులో తెలియజేసింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కు హాజరయ్యే అభ్యర్థులందరూ నమూనా కాపీలను జాగ్రత్తగా పరిశీలించాలని కమిషన్ ఈ సందర్భంగా పేర్కొంది. ప్రశ్నాపత్రాలు ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ఉంటుంది.
గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష మొత్తం 2 పేపర్లకు జరుగుతుంది. మొదటి సెషన్‌లో పేపర్ 1 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. రెండో సెషన్‌లో పేపర్ 2 మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతుంది. రెండు పేపర్లు ఒక్కొక్కటి 120 మార్కులకు 120 మాల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు 120 నిమిషాల్లో సమాధానాలు గుర్తించవల్సి ఉంటుంది. మొదటి పేపర్‌లో 4 పార్టులు ఉంటాయి. పార్ట్ ఏలో హిస్టరీ అండ్ కల్చర్, పార్ట్ బీలో కాన్‌స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ స్టడీస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పార్ట్ సీలో ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్, పార్ట్ డీలో జాగ్రఫీ విభాగాల నుంచి 120 ప్రశ్నలు వస్తాయి.
ఇక పేపర్2లో 2 విభాగాలు ఉంటాయి. పార్ట్ ఏలో జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్, పార్ట్ బీ (1)లో సైన్స్ అండ్ టెక్నాలజీ, పార్ట్ బీ (2)లో కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రిజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పార్ట్ ఏకు 60 మార్కులు, పార్ట్ బీకు60 మార్కులు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. కాగా ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారిని మాత్రమే మెయిన్స్ రాసేందుకు అనుమతిస్తారు. మెయిన్స్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పేపర్-1 సూచనలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పేపర్-2 సూచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.