Viral Video: పెను విషాదం..! పెళ్లి బస్సుపై తెగిపడ్డ హైటెన్షన్‌ కరెంట్‌ వైర్‌.. అంతా సజీవదహనం

ఉత్తర్‌ప్రదేశ్‌లో సోమవారం (మార్చి 11) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గాజీపుర్‌ జిల్లాలో పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సుపై హైటెన్షన్‌ కరెంట్‌ వైరు ఒక్కసారిగా తెగి పడింది. దీంతో బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో బస్సులో ఉన్న పెళ్లి బృందంలో పలువురు సజీవ దహనమైనట్లు అధికారులు వెల్లడించారు. మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలేం జరిగిందంటే..

Viral Video: పెను విషాదం..! పెళ్లి బస్సుపై తెగిపడ్డ హైటెన్షన్‌ కరెంట్‌ వైర్‌.. అంతా సజీవదహనం
Uttar Pradesh Bus Accident
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 11, 2024 | 4:42 PM

ఘాజీపుర్‌, మార్చి 11: ఉత్తర్‌ప్రదేశ్‌లో సోమవారం (మార్చి 11) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గాజీపుర్‌ జిల్లాలో పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సుపై హైటెన్షన్‌ కరెంట్‌ వైరు ఒక్కసారిగా తెగి పడింది. దీంతో బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో బస్సులో ఉన్న పెళ్లి బృందంలో పలువురు సజీవ దహనమైనట్లు అధికారులు వెల్లడించారు. మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలేం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలో బస్సుపై హైటెన్షన్ వైరు తెగిపడింది. దీంతో బస్సుకు మంటలు అంటుకుని పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వారంతా పెళ్లికి వచ్చిన అతిథులు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది.

ఇవి కూడా చదవండి

తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలను వెలికి తీశారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న పలువురిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.