Free Coaching for DSC Jobs: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. 2 నెలలపాటు ఉచిత కోచింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానం

తెలంగాణ సర్కార్ తాజాగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ (టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న ఎస్సీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాల స్డడీ సర్కిల్‌ శనివారం (మార్చి9న) దరఖాస్తులు కోరుతున్నట్లు ఓ ప్రకటనలో తెలియజేసింది..

Free Coaching for DSC Jobs: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. 2 నెలలపాటు ఉచిత కోచింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానం
DSC Free Coaching
Follow us

|

Updated on: Mar 10, 2024 | 4:33 PM

హైదరాబాద్‌, మార్చి 10: తెలంగాణ సర్కార్ తాజాగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ (టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న ఎస్సీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాల స్డడీ సర్కిల్‌ శనివారం (మార్చి9న) దరఖాస్తులు కోరుతున్నట్లు ఓ ప్రకటనలో తెలియజేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 12 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 26వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు.

ఈ మేరకు ప్రభుత్వ డైట్‌, బీ,ఎడ్‌కాలేజీలు ఉన్న కేంద్రాలతో పాటు ఎంపిక చేసిన ఇతర కాలేజీతో కలిపి మొత్తం 16 ప్రాంతాల్లో డీఎస్సీ ఉచిత కోచింగ్‌కు ఎస్సీ స్టడీ సర్కిల్‌ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి కేంద్రంలో 100 మందికి చొప్పున ఉచిత కోచింగ్‌ ఇస్తారు. అయితే అభ్యర్థులు డైట్ (DIET) లేదా టెట్‌ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)లో తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి వివరాలు మార్చి 11 నుంచి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి. 2024 ఏప్రిల్15న కోచింగ్ ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి 2024, జూన్ 14 వరకూ అంటే రెండు నెలలపాటు కోచింగ్‌ ఇవ్వనున్నారు. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌ లో చెక్‌ చేసుకోవచ్చు. ఎంట్రన్స్ ఎగ్జా్మినేషన్‌ ఆధారంగా ఉచిత కోచింగ్‌కు అభ్యర్ధులను ఎంపిక చేయనున్నారు.

ఏప్రిల్ 2 వరకు తెలంగాణ డీఎస్సీ 2024 దరఖాస్తుల స్వీకరణ

కాగా మొత్తం 11,062 టీచర్‌ ఉద్యోగాల్లో.. 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, భాషా పండితులు పోస్టులు 727, పీఈటీ పోస్టులు 182, ఎస్జీటీ పోస్టులు 6508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్ పోస్టులు 220, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) పోస్టులు 796 వరకు ఉన్నాయి. మార్చి 4వ తేదీ నుంచి డీఎస్సీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభంకాగా.. ఏప్రిల్ 2వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. గతంలో డీఎస్సీ దరఖాస్తు చేసుకున్న వారు తాజా నియామకాలకు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవల్సిన అవసరం లేదని విద్యాశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇతర అప్‌డేట్స్‌ కోసం అధికారిక వెబ్‌సైట్‌ చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.