AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur: మణిపూర్‌లో మరోమారు రెచ్చిపోయిన ఉగ్రమూక.. నాలుగో కిడ్నాప్‌ కలకలం! ఈసారి ఎవరంటే..

మణిపుర్‌లో మరో ఆర్మీ ఆఫీసర్‌ కిడ్నాప్‌ అయ్యారు. రాష్ట్రంలోని థౌబాల్‌ జిల్లా చరంగ్‌పట్‌ మమంగ్‌ లైకై ప్రాంతంలోని ఆర్మీ అధికారి ఇంటి నుంచి శుక్రవారం (మార్చి 8) ఉగ్రవాదులు అపహరించారు. తౌబల్ జిల్లాకు చెందిన కోన్సామ్‌ ఖేడాసింగ్‌ ఆర్మీలో జూనియర్ కమాండింగ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఖేఢా సింగ్‌ సెలవులపై ఆయన స్వస్థలంలో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఇంట్లోకి ప్రవేశించిన కొందరు గుర్తు తెలియని ముష్కరులు శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో..

Manipur: మణిపూర్‌లో మరోమారు రెచ్చిపోయిన ఉగ్రమూక.. నాలుగో కిడ్నాప్‌ కలకలం! ఈసారి ఎవరంటే..
Army Officer Kidnaped In Manipur
Srilakshmi C
|

Updated on: Mar 08, 2024 | 7:16 PM

Share

ఇంఫాల్‌, మార్చి 8: మణిపుర్‌లో మరో ఆర్మీ ఆఫీసర్‌ కిడ్నాప్‌ అయ్యారు. రాష్ట్రంలోని థౌబాల్‌ జిల్లా చరంగ్‌పట్‌ మమంగ్‌ లైకై ప్రాంతంలోని ఆర్మీ అధికారి ఇంటి నుంచి శుక్రవారం (మార్చి 8) ఉగ్రవాదులు అపహరించారు. తౌబల్ జిల్లాకు చెందిన కోన్సామ్‌ ఖేడాసింగ్‌ ఆర్మీలో జూనియర్ కమాండింగ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఖేఢా సింగ్‌ సెలవులపై ఆయన స్వస్థలంలో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఇంట్లోకి ప్రవేశించిన కొందరు గుర్తు తెలియని ముష్కరులు శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆయనను బలవంతంగా వాహనంలో తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. జాతీయ రహదారిపై చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి ముమ్మర తనిఖీలు చేపట్టాయి. ఆర్మీ ఆఫీసర్‌ ఖేఢా సింగ్‌ను ఎందుకు కిడ్నాప్‌ చేశారో తమకు తెలియదని, ముష్కరులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని ఆర్మీ అధికారులు తెలిపారు. కిడ్నాప్ అయిన అధికారి కోసం భద్రతా దళాలు బృందాలుగా ఏర్పడి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. కాగా గతంలోనూ డబ్బు డిమాండ్‌ చేస్తూ అతనికి బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వచ్చినట్లు కుటుంబసభ్యులు చెప్పారు.

కాగా గత ఏడాది (2023) మేలో మణిపూర్‌ సరిహద్దు ప్రాంతంలో జాతి హింస ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు నలుగురు ఆర్మీ అధికారులను ఉగ్రమూక కిడ్నాప్‌ చేసింది. సెలవుల్లో ఉన్న అధికారులు, విధుల్లో ఉన్నవారి బంధువులు లక్ష్యంగా ఈ కిడ్నాపులు చేస్తున్నారు.సెప్టెంబర్ 2023లో అస్సాం రెజిమెంట్ మాజీ సైనికుడు సెర్టో తంగ్‌తంగ్ కోమ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి, దారుణంగా హతమార్చారు. ఆయన మణిపూర్‌లోని లీమాఖోంగ్‌లో డిఫెన్స్ సర్వీస్ కార్ప్స్ (DSC)లో విధులు నిర్వహిస్తున్నారు. సంఘటన జరిగిన సమయంలో ఆయన ఇంఫాల్ వెస్ట్‌లోని తన ఇంట్లో సెలవులో ఉన్నాడు. ఈ సంఘటన జరిగిన రెండు నెలల తర్వాత కొండ జిల్లా చురాచంద్‌పూర్ నుంచి లీమాఖోంగ్‌కు ఎస్‌యూవీలో ప్రయాణిస్తుండగా గుర్తుతెలియని ముష్కరులు నలుగురు వ్యక్తులను కిడ్నాప్ చేసి చంపేశారు. ఆ నలుగురు జమ్మూ కాశ్మీర్‌లో విధులు నిర్వహిస్తోన్న భారత ఆర్మీ సైనికుడి కుటుంబ సభ్యులు.

కిడ్నాప్‌ సమయంలో సైనికుడి తండ్రి గాయాలతో తప్పించుకోగలిగాడు. సమాచారం అందుకున్న సైన్యం విమానంలో అస్సాంలోని గౌహతిలోని బేస్ ఆసుపత్రికి తరలించారు. గత నెలలో ఫిబ్రవరి 27న పశ్చిమ ఇంఫాల్‌లో అదనపు ఎస్పీ అమిత్‌సింగ్‌ను అరంబై టెంగోల్‌ వర్గం వారు కిడ్నాప్‌ చేశారు. అయితే భద్రతా బలగాలు సకాలంలో స్పందించి ఆయనను కాపాడగలిగారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా.. ఏదో ఒకచోట ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా లోయ ప్రాంతాల్లో సంఘ విద్రోహ శక్తులను కట్టడి చేయడం సవాలుగా మారిందని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.