Half Day Schools: విద్యార్ధులకు అలర్ట్.. మర్చి 15 నుంచి అన్ని పాఠశాలలకు ఒంటిపూట బడులు! వేసవి సెలవులు ఎప్పటినుంచంటే

ఎండ తీవ్రత పెరుగుతున్న క్రమంలో తెలుగు రాష్ట్రాలు ఒంటిపూట బడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. మార్చి ఆరంభం నుంచే భానుడి భగభగలు బెంబేలెత్తిస్తున్నాయి. సామాన్యులు బయట అడుగు పెట్టాలంటే హడలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మార్చి15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలకు ఉత్తర్వులు..

Half Day Schools: విద్యార్ధులకు అలర్ట్.. మర్చి 15 నుంచి అన్ని పాఠశాలలకు ఒంటిపూట బడులు! వేసవి సెలవులు ఎప్పటినుంచంటే
Half Day Schools
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 07, 2024 | 4:01 PM

హైదరాబాద్‌, మార్చి 7: ఎండ తీవ్రత పెరుగుతున్న క్రమంలో తెలుగు రాష్ట్రాలు ఒంటిపూట బడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. మార్చి ఆరంభం నుంచే భానుడి భగభగలు బెంబేలెత్తిస్తున్నాయి. సామాన్యులు బయట అడుగు పెట్టాలంటే హడలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మార్చి15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలల వేళలు నిర్ణయించింది. మార్చి 15 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్‌ స్కూళ్లు ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యార్ధులకు క్లాసులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. 10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత యథాతథంగా ఉదయం పూటే తరగతులు నడుస్తాయని వివరించింది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు తెలంగాణలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 24వ తేదీ పాఠశాలలకు చివరి పని దినం కావడంతో ఏప్రిల్‌ 25 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటినుంచంటే..

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఒంటిపూట బడులపై ప్రభుత్వం ఇంత వరకూ ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. ఎండలు మండిపోతుండటంతో విద్యార్ధులు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని, మార్చి 11 నుంచే అన్ని పాఠశాలలకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ఎస్టీయూ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. కాగా ఒంటిపూట బడులు, వేసవి సెలవులపై ఇప్పటికే రాష్ట్ర సర్కార్‌ కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఏపీలోనూ మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే హాల్‌ టికెట్లు కూడా బోర్డు విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 7,25,620 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరుకానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,473 పరీక్ష సెంటర్లను సిద్ధం చేశారు.

పదో తరగతి పరీక్షలకు పరీక్షా సెంటర్లుగా ఎంపిక చేసిన పాఠశాలల్లో మధ్యాహ్నం వేళ క్లాసులు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయా బడుల్లో ముందుగా విద్యార్ధులకు మధ్యాహ్నం భోజనం అందించి, ఆ తర్వాత తరగతులు నిర్వహించనున్నారు. మార్చి 28తో టెన్త్‌ ప్రధాన పరీక్షలు ముగిసినా.. మరో రెండు రోజులు రియంటల్, ఒకేషనల్‌ పరీక్షలుంటాయి. మార్చి 30తో పరీక్షలు ముగిశాక యధావిధిగా ఉదయం పూట తరగతులు నిర్వహిస్తారని సమాచారం. ఏపీలో ఒంటిపూట బడులు, వేసవి సెలవుపై ఒకట్రెండు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.