APPSC Notifications 2024: ఏపీ నిరుద్యోగులకు అలర్ట్‌.. ఉద్యోగాల భర్తీకి 4 కొత్త నోటిఫికేషన్లు జారీ చేసిన ఏపీపీఎస్సీ

ఏపీ నిరుద్యోగుల కోసం జగన్‌ సర్కార్ మరో నాలుగు కొత్త నోటిఫికేషన్లను జారీ చేశాడు. నాలుగు ప్రభుత్వ శాఖలకు సంబంధించి మొత్తం 49 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 4 వేర్వేరు నోటిఫికేషన్‌లను మార్చి 6 (గురువారం) జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ల కింద ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, స్టాటిస్టికల్ ఆఫీసర్లు, ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు భర్తీకానున్నాయి. వీటిల్లో అత్యధికంగా ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టులు ఉన్నాయి..

APPSC Notifications 2024: ఏపీ నిరుద్యోగులకు అలర్ట్‌.. ఉద్యోగాల భర్తీకి 4 కొత్త నోటిఫికేషన్లు జారీ చేసిన ఏపీపీఎస్సీ
APPSC
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 07, 2024 | 3:27 PM

అమరావతి, మార్చి 7: ఏపీ నిరుద్యోగుల కోసం జగన్‌ సర్కార్ మరో నాలుగు కొత్త నోటిఫికేషన్లను జారీ చేశాడు. నాలుగు ప్రభుత్వ శాఖలకు సంబంధించి మొత్తం 49 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 4 వేర్వేరు నోటిఫికేషన్‌లను మార్చి 6 (గురువారం) జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ల కింద ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, స్టాటిస్టికల్ ఆఫీసర్లు, ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు భర్తీకానున్నాయి. వీటిల్లో అత్యధికంగా ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టులు ఉన్నాయి.

నాలుగు నోటిఫికేషన్లలో ఏయే శాఖల్లో ఏయే పోస్టులున్నాయంటే..

  • ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టులు: 37
  • అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టులు: 5
  • ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పోస్టులు: 4
  • అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు: 3

వీటిల్లో అటవీశాఖ అధికారి పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్‌ 15 నుంచి ప్రారంభమవుతుంది. మే 5వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. జోన్ల వారీగా చూస్తే జోన్ 1 లో 8 పోస్టులు, జోన్ 2లో 11 పోస్టులు, జోన్ 3లో 10 పోస్టులు, జోన్ 4లో 8 పోస్టులున్నాయి. వీటిలో ఓసీ కేటగరీకి చెందిన వారికి 14 పోస్టులు కేటాయించగా.. మిగిలిన పోస్టులు వివిధ రిజర్వేషన్ వర్గాలకు కేటాయించారు. బీసీ (ఏ) 3, బీసీ (బి) 3, బీసీ (సీ) 1, బీసీ (డీ) 4, బీసీ (ఇ) 2, ఎస్సీ 7, ఎస్టీ 1, ఈడబ్ల్యూఎస్ కేటగరీకి 3 పోస్టులు ఉన్నాయి. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు అగ్రికల్చర్, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, ఫారెస్ట్రీ, జువాలజీ, హార్టికల్చర్, మేథ్స్ ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్సెస్‌లలో ఏదైనా ఒక విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

5 స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 18 నుంచి మే 8 వరకూ దరఖాస్తులు స్వీకరించనున్నారు. 4 ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులకు ఏప్రిల్ 23 నుంచి మే 13 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 3 ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్షన్ పోస్టులకు మార్చి 21 నుంచి ఏప్రిల్ 10 వరకూ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. ఇటీవలి కాలంలో ఎపీపీఎస్సీ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు జారీ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
అక్కడి పురాతన గుడిలో సినిమా మొదలు.? రామ్ చరణ్ సెంటిమెంట్ ఆ.!
అక్కడి పురాతన గుడిలో సినిమా మొదలు.? రామ్ చరణ్ సెంటిమెంట్ ఆ.!
54 ఏళ్ల వయసులో.. హాట్ నటితో ఘాటు ప్రేమాయణం.! నెక్స్ట్ పెళ్లా.?
54 ఏళ్ల వయసులో.. హాట్ నటితో ఘాటు ప్రేమాయణం.! నెక్స్ట్ పెళ్లా.?
వివాదంలో రామ్‌ చరణ్ అయ్యప్ప ఐక్యవేదిక సీరియస్| రికార్డుల వేటమొదలు
వివాదంలో రామ్‌ చరణ్ అయ్యప్ప ఐక్యవేదిక సీరియస్| రికార్డుల వేటమొదలు