APPSC Group1 Prelims Exam Date: ‘ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీలో మార్పు లేదు’.. వారంలో హాల్‌టికెట్లు!

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 1 సర్వీస్‌ ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు ఉండబోదని ఏపీపీఎస్సీ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న మాదిరిగానే మార్చి 17వ తేదీనే పరీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఆఫ్‌లైన్‌ విధానంలో ఓఎమ్మార్‌ షీట్‌ ఆధారిత పరీక్ష ఉంటుందని పేర్కొంది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదల చేయనున్నట్లు తెలిపింది..

APPSC Group1 Prelims Exam Date: 'ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీలో మార్పు లేదు'.. వారంలో హాల్‌టికెట్లు!
APPSC Group1 Prelims
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 07, 2024 | 3:19 PM

అమరావతి, మార్చి 7: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 1 సర్వీస్‌ ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు ఉండబోదని ఏపీపీఎస్సీ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న మాదిరిగానే మార్చి 17వ తేదీనే పరీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఆఫ్‌లైన్‌ విధానంలో ఓఎమ్మార్‌ షీట్‌ ఆధారిత పరీక్ష ఉంటుందని పేర్కొంది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో 81 గ్రూప్‌ 1 సర్వీసు పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. మొత్తం పోస్టుల్లో 9 డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు, 18 ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ పోస్టులు, 26 డీఎస్పీ (సివిల్‌) పోస్టులు, 6 రీజనల్‌ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్‌ పోస్టులు, 5 కోఆపరేటివ్‌ సర్వీసెస్‌లో డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టులు, 4 జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ పోస్టులు ఉన్నాయి.

ఇక 3 జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి పోస్టులు, 1 అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ పోస్టు, 3 అసిస్టెంట్‌ అకౌంట్స్‌ అధికారి పోస్టులు, 2 అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ పోస్టులు, 1 జైళ్ల శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ పోస్టు, 1 జిల్లా బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టు, 1 మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌ -2 పోస్టు, 1 అసిస్టెంట్ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పోస్టు ఉన్నాయి. మార్చి 17న జరిగే ప్రిలిమినరీ పరీక్ష పూర్తిగా అబ్జెక్టివ్‌ ప్రశ్నల రూపంలో ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారిని మాత్రమే మెయిన్స్‌కు అనుమతిస్తారు. మెయిన్‌ పరీక్ష డిస్క్రిప్టివ్‌ విధానంలో జరుగుతుంది. అయితే మెయిన్స్ తేదీని ఏపీపీఎస్సీ ఇంకా ఖరారు చేయలేదు.

ఏపీ టెట్‌ 2024 ప్రాథమిక ఆన్సర్‌ కీ విడుదల.. మార్చి 14న తుది ఫలితాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫిబ్రవరి 27వ తేదీ నుంచి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు మరో 2 రోజులు అంటే మార్చి 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో మార్చి 3వ తేదీ వరకు జరిగిన పరీక్షల ప్రాథమిక ఆన్సర్‌ కీలతోపాటు రెస్పాన్స్‌ షీట్లను కూడా విద్యా శాఖ తాజాగా విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు టెట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్‌ కీలను, రెస్పాన్స్‌ షీట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో అభ్యర్థి ఐడీ, పుట్టినతేదీ, వెరిఫికేషన్‌ కోడ్‌ వివరాలు నమోదు చేసి రెస్పాన్స్‌ షీట్ డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రాథమిక ఆన్సర్‌ కీపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఆన్‌లైన్‌లో అభ్యంతరాలను తెలియజేయవచ్చు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది ఫలితాలు మార్చి 14న విడుదల కానున్నాయి. కాగా డీఎస్సీ పరీక్షలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుందన్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
అక్కడి పురాతన గుడిలో సినిమా మొదలు.? రామ్ చరణ్ సెంటిమెంట్ ఆ.!
అక్కడి పురాతన గుడిలో సినిమా మొదలు.? రామ్ చరణ్ సెంటిమెంట్ ఆ.!
54 ఏళ్ల వయసులో.. హాట్ నటితో ఘాటు ప్రేమాయణం.! నెక్స్ట్ పెళ్లా.?
54 ఏళ్ల వయసులో.. హాట్ నటితో ఘాటు ప్రేమాయణం.! నెక్స్ట్ పెళ్లా.?
వివాదంలో రామ్‌ చరణ్ అయ్యప్ప ఐక్యవేదిక సీరియస్| రికార్డుల వేటమొదలు
వివాదంలో రామ్‌ చరణ్ అయ్యప్ప ఐక్యవేదిక సీరియస్| రికార్డుల వేటమొదలు