Jobs: ఎయిర్ పోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. వాక్ ఇన్ ఇంటర్వూ ఎప్పుడంటే..

ఎయిర్ ఇండియా ఎయిర్‌ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం - విజయవాడ ఎయిర్ పోర్టుల్లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రస్తుత ఉద్యోగాల భర్తీతో పాటు భవిష్యత్తులో ఏర్పడే ఖాళీలను కూడా వెయిట్ లిస్ట్ జాబితాను రూపొందిస్తారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

Jobs: ఎయిర్ పోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. వాక్ ఇన్ ఇంటర్వూ ఎప్పుడంటే..
Jobs
Follow us
M Sivakumar

| Edited By: Srikar T

Updated on: Mar 07, 2024 | 5:06 PM

ఎయిర్ ఇండియా ఎయిర్‌ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం – విజయవాడ ఎయిర్ పోర్టుల్లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రస్తుత ఉద్యోగాల భర్తీతో పాటు భవిష్యత్తులో ఏర్పడే ఖాళీలను కూడా వెయిట్ లిస్ట్ జాబితాను రూపొందిస్తారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. విశాఖపట్నం ఎయిర్‌ పోర్టులో కస్టమర్ సర్వీస్ జూనియర్ ఆఫీసర్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, హ్యాండీ మ్యాన్ , హ్యాండీ ఉమెన్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. విశాఖపట్నంలో భర్తీ చేసే ఉద్యోగాల్లో జూనియర్ ఆఫీసర్ ఖాళీలు ఐదు, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు 22, జూనియర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు 14, హ్యాండీమాన్ ఉద్యోగాలు 36 ఉన్నాయి.. మార్చి9వ తేదీన జరిగే వాకిన్ సెలక్షన్‌లో అభ్యర్థుల్ని ఎంపిక చేయనున్నారు. ఉదయం 9.30 నుంచి 12.30వరకు ఈ సెలక్షన్ ప్రక్రియ జరుగుతుంది. హ్యాండీ మ్యాన్ ఉద్యోగాలను మాత్రం మార్చి 11వ తేదీ ఉదయం 9.30 నుంచి 12.30 మధ్య ఎంపిక చేస్తారు.

కావాల్సిన అర్హత ..

జూనియర్ సర్వీస్ ఆఫీసర్ ఉద్యోగాలకు గరిష్టంగా 35ఏళ్ల వయసు ఉండాలి. ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్ధులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్హతలతో 9ఏళ్ల పాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. ప్యాసింజర్ చెక్‌ ఇన్‌, కార్గో హ్యాండ్లింగ్‌లో అనుభవం ఉండాలి. నెలకు రూ.29.760 వేతనం చెల్లిస్తారు. ఇంగ్లీష్, హిందీ భాషల్లో పట్టు ఉండాలి. ఎంబిఏ విద్యార్హత కలిగిన వారికి ఏవియేషన్‌ రంగంలో ఆరేళ్ల అనుభవం ఉన్నా అనుమతిస్తారు. అభ్యర్థులు కంప్యూటర్ వినియోగంలో నైపుణ్యం కలిగి ఉండాలి.

కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు 10వ తరగతి తర్వాత ఇంటర్, డిగ్రీలతో పాటు ఎయిర్‌లైన్‌, జిహెచ్‌ఏ, కార్గో, ఎయిర్‌లైన్‌ టికెటింగ్, ఎయిర్‌లైన్ డిప్లొమా, ఎయిర్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులు చేసి ఉండాలి. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌లకు రూ.24,960, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌లకు రూ.21,270 వేతనం చెల్లిస్తారు. హ్యాండీ మ్యాన్, హ్యాండీ ఉమన్ ఉద్యోగాలకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీష్ భాషను చదవగలిగి ఉండాలి. రూ.18,840 వేతనం చెల్లిస్తారు. నిర్దేశిత దరఖాస్తుతో పాటు విద్యార్హతలతో వాక్‌ ఇన్‌ సెలక్షన్స్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఎంపిక చేసే ప్రదేశం..

విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలోని సిఎన్‌ఎస్‌ ట్రైనింగ్ ఫెసిలిటీ సెంటర్‌లో నిర్వహిచనున్నారు. ఓల్డ్ ఎయిర్‌ పోర్ట్ కార్గో టెర్మినల్‌లో ఈ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది. ఏఐ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్ లిమిటెడ్ గతంలో ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్‌గా ఉండేది. దరఖాస్తుదారులు భారత పౌరులై ఉండాలి.

విజయవాడ ఎయిర్ పోర్టులో మార్చి 16న ఎంపిక ..

విజయవాడ విమానాశ్రయంలో ప్యాసింజర్ సర్వీస్ ఏజెంట్, ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, హ్యాండీ మ్యాన్, హ్యాండీ ఉమన్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు 2, హ్యాండీ మ్యాన్ ఉద్యోగాలు 16వ భర్తీ చేస్తారు.మార్చి 16వ తేదీన విజయవాడ గన్నవరంలోని ఎయిర్‌ పోర్ట్‌ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ వెటర్నరీ కాలేజీ ప్రాంగణంలో ఎంపికలు నిర్వహిచనున్నారు. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు మెకానికల్, ఎలక్ట్రికల్ ప్రొడక్షన్, ఆటోమోబైల్ డిప్లొమా, ఎలక్ట్రానిక్స్ ఉద్యోగాల్లో మూడేళ్ల డిప్లొమా కలిగి ఉండాలి. ఐటిఐ విద్యార్హతతో పాటు ఎన్‌సిటివిటి శిక్షణ పూర్తి చేసుకున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో పాటు హెవీ మోటర్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి. గరిష్ట వయసు 28ఏళ్లుగా నిర్ణయించారు. రూ.24,960 వేతనం చెల్లిస్తారు. హ్యాండీ మ్యాన్, హ్యాండీ ఉమన్ ఉద్యోగాలకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీష్ భాషను చదవగలిగి ఉండాలి. రూ.18,840 వేతనం చెల్లిస్తారు. నిర్దేశిత దరఖాస్తుతో పాటు విద్యార్హతలతో వాక్‌ ఇన్‌ సెలక్షన్స్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
"కౌన్ హైన్?".. కపిల్ అంత మాట అంటాడని ఎవరు ఊహించలేదు..!