RRB-RPF Recruitment 2024: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సులో 4,660 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. టెన్త్, డిగ్రీ అర్హత

దేశవ్యాప్తంగా రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రైల్వేశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు (ఆర్‌పీఎఫ్‌), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్‌ఎఫ్‌)లలో మొత్తం 4,660 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన , ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..

RRB-RPF Recruitment 2024: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సులో 4,660 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. టెన్త్, డిగ్రీ అర్హత
Railway Protection Force
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 07, 2024 | 9:37 PM

దేశవ్యాప్తంగా రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రైల్వేశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు (ఆర్‌పీఎఫ్‌), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్‌ఎఫ్‌)లలో మొత్తం 4,660 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన , ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి, డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు. అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్‌, చెన్నై, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్.. ఆర్‌ఆర్‌బీ రీజియన్లలో పోస్టులను భర్తీ చేస్తారు.

కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉంటే సరిపోతుంది. ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే విద్యార్హతలతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కూడా కలిగి ఉండాలి. అలాగే దరఖాస్తు దారుల వయసు జులై 01, 2024 నాటికి కానిస్టేబుల్ పోస్టులకైతే 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సై పోస్టులకైతే 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాత పరీక్ష, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్‌ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు ఎస్సై పోస్టులకు రూ.35,400, కానిస్టేబుల్ పోస్టులకు రూ.21,700 చొప్పున జీతభత్యాలు చెల్లిస్తారు.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మే 14, 2024వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచు. దరఖాస్తు సమయంలో ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250లు, ఇతర కేటగారీలకు చెందిన వారు రూ.500లు రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద చెల్లించాలి. రీజియన్ల వారీ ఖాళీల వివరాలు, పోస్టుల వారీగతా విద్యార్హతలు, రాత పరీక్ష విధానం, సిలబస్‌ తదితరాలకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో విడుదలయ్యే వివరణాత్మక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఖాళీల వివరాలు..

మొత్తం పోస్టుల సంఖ్య: 4660

  • కానిస్టేబుల్ పోస్టులు: 4,208
  • సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు: 452

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

అమెరికాలో భూమికి 200 అడుగుల కింద భారీ బంకర్‌.! అదిరిపోయిన ప్లాన్.
అమెరికాలో భూమికి 200 అడుగుల కింద భారీ బంకర్‌.! అదిరిపోయిన ప్లాన్.
చేపల కోసం వల వేస్తే.. ఏం చిక్కిందో చూడండి.! వీడియో వైరల్..
చేపల కోసం వల వేస్తే.. ఏం చిక్కిందో చూడండి.! వీడియో వైరల్..
కిరాణా షాపులు కనుమరుగయ్యే కాలం వచ్చిందా.? కారణం అదేనా.!
కిరాణా షాపులు కనుమరుగయ్యే కాలం వచ్చిందా.? కారణం అదేనా.!
కదులుతున్న బస్సులో యువకుడు చేసిన పనికి అంతా షాక్‌.! వీడియో..
కదులుతున్న బస్సులో యువకుడు చేసిన పనికి అంతా షాక్‌.! వీడియో..
రైతంటే నువ్వే అన్నా.. నీ ఐడియాకు సలామ్.! వీడియో..
రైతంటే నువ్వే అన్నా.. నీ ఐడియాకు సలామ్.! వీడియో..
"వితౌట్ ఐస్'' అని చెప్పడం మరిచిపోతున్నారా.? అంతే సంగతులు..
ఎక్కడ చూసినా పుష్ఫ మేనియానే.. ముంబయిలో అట్టహాసంగా ఈవెంట్‌..
ఎక్కడ చూసినా పుష్ఫ మేనియానే.. ముంబయిలో అట్టహాసంగా ఈవెంట్‌..
అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు
అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు
చితిపై నుంచి లేచొచ్చిన మనిషి.! ఆ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
చితిపై నుంచి లేచొచ్చిన మనిషి.! ఆ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
తల్లి ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా.? ఏనుగుల చక్ర వ్యూహం..
తల్లి ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా.? ఏనుగుల చక్ర వ్యూహం..