UPSC ESI Recruitment 2024: నర్సింగ్ అభ్యర్ధులకు అలర్ట్..1930 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల

కేంద్ర ప్రభుత్వానికి చెందిన కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో శాశ్వత ప్రాతిపదికన నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1930 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు మార్చి 7వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..

UPSC ESI Recruitment 2024: నర్సింగ్ అభ్యర్ధులకు అలర్ట్..1930 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల
UPSC ESI Recruitment
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 07, 2024 | 9:54 PM

కేంద్ర ప్రభుత్వానికి చెందిన కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో శాశ్వత ప్రాతిపదికన నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1930 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు మార్చి 7వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..

కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు..

మొత్తం నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు:  1,930

  • యూఆర్‌ కేటగిరీలో పోస్టుల వివరాలు: 892
  • ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో పోస్టుల వివరాలు: 193
  • ఓబీసీ కేటగిరీలో పోస్టుల వివరాలు: 446
  • ఎస్సీ కేటగిరీలో పోస్టుల వివరాలు: 235
  • ఎస్టీ కేటగిరీలో పోస్టుల వివరాలు: 164
  • దివ్యాంగుల కేటగిరీలో పోస్టుల వివరాలు: 168

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్/ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో తప్పనిసరిగా నర్సు లేదా నర్సు, మిడ్‌వైఫ్‌గా రిజిస్టరై ఉండాలి. లేదా జనరల్ నర్సింగ్ మిడ్-వైఫరీలో డిప్లొమా కోర్సు చేసి ఉండాలి. అలాగే కనీసం యాభై పడకల ఆసుపత్రిలో ఏడాది పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు మార్చి 27, 2024 నాటికి జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఓబీసీ 33 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీ 35 ఏళ్లు, దివ్యాంగలకు 40 సంవత్సరాల వయసు మించకూడదు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద రూ.25 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. రాత పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీల వివరాలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: మార్చి 7, 2024.
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 27, 2024.
  • దరఖాస్తు సవరణ తేదీలు: మార్చి 28 నుంచి ఏప్రిల్‌ 03, 2024 వరకు.
  • రాత పరీక్ష తేదీ: జులై 07, 2024.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

అమెరికాలో భూమికి 200 అడుగుల కింద భారీ బంకర్‌.! అదిరిపోయిన ప్లాన్.
అమెరికాలో భూమికి 200 అడుగుల కింద భారీ బంకర్‌.! అదిరిపోయిన ప్లాన్.
చేపల కోసం వల వేస్తే.. ఏం చిక్కిందో చూడండి.! వీడియో వైరల్..
చేపల కోసం వల వేస్తే.. ఏం చిక్కిందో చూడండి.! వీడియో వైరల్..
కిరాణా షాపులు కనుమరుగయ్యే కాలం వచ్చిందా.? కారణం అదేనా.!
కిరాణా షాపులు కనుమరుగయ్యే కాలం వచ్చిందా.? కారణం అదేనా.!
కదులుతున్న బస్సులో యువకుడు చేసిన పనికి అంతా షాక్‌.! వీడియో..
కదులుతున్న బస్సులో యువకుడు చేసిన పనికి అంతా షాక్‌.! వీడియో..
రైతంటే నువ్వే అన్నా.. నీ ఐడియాకు సలామ్.! వీడియో..
రైతంటే నువ్వే అన్నా.. నీ ఐడియాకు సలామ్.! వీడియో..
"వితౌట్ ఐస్'' అని చెప్పడం మరిచిపోతున్నారా.? అంతే సంగతులు..
ఎక్కడ చూసినా పుష్ఫ మేనియానే.. ముంబయిలో అట్టహాసంగా ఈవెంట్‌..
ఎక్కడ చూసినా పుష్ఫ మేనియానే.. ముంబయిలో అట్టహాసంగా ఈవెంట్‌..
అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు
అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు
చితిపై నుంచి లేచొచ్చిన మనిషి.! ఆ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
చితిపై నుంచి లేచొచ్చిన మనిషి.! ఆ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
తల్లి ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా.? ఏనుగుల చక్ర వ్యూహం..
తల్లి ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా.? ఏనుగుల చక్ర వ్యూహం..