Telangana Job Calendar: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఏటా జాబ్‌ క్యాలెండర్‌!

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు రేవంత్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ తరహాలో నిర్ణీత కాలవ్యవధితో ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయనుంది. ఇకపై ఏటా జనవరి 1వ తేదీన టీఎస్‌పీఎస్సీ, గురుకుల, పోలీసు, వైద్య నియామక బోర్డుల ఆధ్వర్యంలో జాబ్‌ క్యాలెండర్లు ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది..

Telangana Job Calendar: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఏటా జాబ్‌ క్యాలెండర్‌!
Telangana Job Calendar
Follow us

|

Updated on: Mar 08, 2024 | 6:17 PM

హైదరాబాద్‌, మార్చి 8: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు రేవంత్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ తరహాలో నిర్ణీత కాలవ్యవధితో ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయనుంది. ఇకపై ఏటా జనవరి 1వ తేదీన టీఎస్‌పీఎస్సీ, గురుకుల, పోలీసు, వైద్య నియామక బోర్డుల ఆధ్వర్యంలో జాబ్‌ క్యాలెండర్లు ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. టీఎస్పీయస్సీ గ్రూప్‌-1, 2, 3, 4లతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల ఖాళీల వివరాలను ప్రకటనలు వెలువరించడం వల్ల నిరుద్యోగులు ప్రణాళికాబద్ధంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో ప్రామాణిక రాష్ట్రస్థాయి ముసాయిదా జాబ్‌ క్యాలెండర్‌ను సిద్ధం చేస్తున్నారు. దీన్ని త్వరలోనే ప్రభుత్వ అనుమతి కోసం పంపించనుంది. ప్రభుత్వం అనుమతి వచ్చిన వెంటనే.. ఈ ఏడాది నుంచే జాబ్‌ క్యాలెండర్‌ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తరహాలో ఏటా తెలంగాణలో కూడా రాష్ట్ర జాబ్‌ క్యాలెండర్‌ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించింది. ముందుగా ప్రకటించిన ప్రకారంగా ఆయా విభాగాల్లోని రాష్ట్రస్థాయి ఉద్యోగాలకు ప్రామాణిక జాబ్‌ క్యాలెండర్‌ సిద్ధం చేయాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసిన తరువాత ఏ నెలలో ఏ నోటిఫికేషన్‌ ఇస్తారు.. ఏయే నెలల్లో పరీక్షలు జరుగుతాయి.. నియామక ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందనే విషయాలను అందులో స్పష్టంగా తెలియజేస్తారు.

జాబ్‌ క్యాలెండర్‌లో ఇచ్చిన తేదీల మేరకు ఆయా గడువు తేదీల్లోగా నియామకాలు పూర్తవుతాయి. దీనిపై ప్రభుత్వ విభాగాధిపతుల సలహాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తీసుకుంటోంది. సర్వీసు నిబంధనలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడంతోపాటు, ఖాళీల గుర్తింపు, ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులు వంటి తదితర అంశాలను తెలుసుకుంటోంది. జాబ్‌ క్యాలెండర్‌ అమల్లోకి వస్తే.. టీఎస్‌పీఎస్సీ, పోలీసు, గురుకుల, వైద్యఆరోగ్య నియామక బోర్డుల నుంచి యేటా ఉద్యోగ ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి. 

Latest Articles
బాలుడి ప్రాణం తీసిన ఘాటైన చిప్‌ ఛాలెంజ్‌..
బాలుడి ప్రాణం తీసిన ఘాటైన చిప్‌ ఛాలెంజ్‌..
అదృశ్యమైన నటుడు.. 24 రోజుల తర్వాత ఇంటికొచ్చాడు
అదృశ్యమైన నటుడు.. 24 రోజుల తర్వాత ఇంటికొచ్చాడు
పాతాళానికి భూగర్భ జలాలు.. నెలకు లక్షకు పైగా ట్యాంకర్ల బుకింగ్‌
పాతాళానికి భూగర్భ జలాలు.. నెలకు లక్షకు పైగా ట్యాంకర్ల బుకింగ్‌
అన్నం వండే ముందు ఇలా చేయండి.. బ్లడ్ షుగర్ పెరగదు..బరువు తగ్గుతారు
అన్నం వండే ముందు ఇలా చేయండి.. బ్లడ్ షుగర్ పెరగదు..బరువు తగ్గుతారు
గంభీర్..ఫ్లెమింగ్ కాదు.. టీమిండియా కోచ్ రేసులో మరో దిగ్గజ ప్లేయర్
గంభీర్..ఫ్లెమింగ్ కాదు.. టీమిండియా కోచ్ రేసులో మరో దిగ్గజ ప్లేయర్
ప్రపంచంలో అతి అరుదైన బ్లడ్ గ్రూప్స్.. ఎక్కడ ఎలా దొరుకుతాయంటే..
ప్రపంచంలో అతి అరుదైన బ్లడ్ గ్రూప్స్.. ఎక్కడ ఎలా దొరుకుతాయంటే..
మళ్లీ పటాస్ ప్రవీణ్‌తో జబర్దస్త్ ఫైమా..కొత్త లవర్‌ను పరిచయం చేసి
మళ్లీ పటాస్ ప్రవీణ్‌తో జబర్దస్త్ ఫైమా..కొత్త లవర్‌ను పరిచయం చేసి
ఎదుటివారిలో ఈ లక్షణాలు కనిపిస్తే అబద్దాలు చెబుతున్నారని అర్ధమట
ఎదుటివారిలో ఈ లక్షణాలు కనిపిస్తే అబద్దాలు చెబుతున్నారని అర్ధమట
ఆ కాంట్రవర్సీలో ఇరుక్కున్న పాయల్ రాజ్‌పుత్.. కెరీర్‌పై ఎఫెక్ట్.
ఆ కాంట్రవర్సీలో ఇరుక్కున్న పాయల్ రాజ్‌పుత్.. కెరీర్‌పై ఎఫెక్ట్.
ఫైనల్‌కు వెళ్లేదెవరు?KKRతో క్వాలిఫైయర్ మ్యాచ్.. టాస్ గెలిచిన SRH
ఫైనల్‌కు వెళ్లేదెవరు?KKRతో క్వాలిఫైయర్ మ్యాచ్.. టాస్ గెలిచిన SRH