APPSC Group 1 Hall Tickets: మరో 2 రోజుల్లో ఏపీపీఎస్సీ గ్రూప్-1 హాల్ టికెట్లు విడుదల.. ముఖ్య సూచనలు ఇవే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ రాత పరీక్ష హాల్‌టికెట్లు మార్చి 10వ తేదీన విడుదల కానున్నాయి. గ్రూప్-1 స్ర్కీనింగ్ టెస్ట్‌కు సంబంధించిన హాల్ టికెట్లను ఆదివారం (మార్చి 10) నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ సెక్రటరీ శుక్రవారం (మార్చి8న) ఓ ప్రకటనలో తెలియజేశారు. గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు ఉండదని, గతంలో నిర్ణయించిన విధంగానే మార్చి 17న పరీక్ష యథావిధిగా..

APPSC Group 1 Hall Tickets: మరో 2 రోజుల్లో ఏపీపీఎస్సీ గ్రూప్-1 హాల్ టికెట్లు విడుదల.. ముఖ్య సూచనలు ఇవే
APPSC Group 1 Hall Tickets
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 08, 2024 | 6:45 PM

అమరావతి, మార్చి 8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ రాత పరీక్ష హాల్‌టికెట్లు మార్చి 10వ తేదీన విడుదల కానున్నాయి. గ్రూప్-1 స్ర్కీనింగ్ టెస్ట్‌కు సంబంధించిన హాల్ టికెట్లను ఆదివారం (మార్చి 10) నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ సెక్రటరీ శుక్రవారం (మార్చి8న) ఓ ప్రకటనలో తెలియజేశారు. గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు ఉండదని, గతంలో నిర్ణయించిన విధంగానే మార్చి 17న పరీక్ష యథావిధిగా నిర్వహిస్తారని స్పష్టం చేశారు. మార్చి 17న పేపర్‌ 1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరుగుతుందని వివరించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకొని, కేటాయించిన పరీక్ష కేంద్రాలను కనీసం ఒకరోజు ముందుగానే చూసుకోవాలని సూచించారు. ఫలితంగా పరీక్ష రోజున ఎలాంటి ఇబ్బంది లేకుండా సమయానికి పరీక్షకు హాజరు కావచ్చని ఆయన సూచించారు.

కాగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 81 గ్రూప్‌ 1 సర్వీసు పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. మొత్తం పోస్టుల్లో డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు 8, ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ పోస్టులు 18, డీఎస్పీ (సివిల్‌) పోస్టులు 26, అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ పోస్టు 1, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ అధికారి పోస్టులు 3, రీజనల్‌ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్‌ పోస్టులు 6, కోఆపరేటివ్‌ సర్వీసెస్‌లో డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టులు 5, జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ పోస్టులు 4, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి పోస్టులు 3, అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ పోస్టులు 2, జైళ్ల శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ పోస్టు 1, జిల్లా బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టు 1, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌ -2 పోస్టు 1, అసిస్టెంట్ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పోస్టు 1.. ఉన్నాయి. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారిని మాత్రమే మెయిన్స్‌కు అనుమతిస్తారు. మెయిన్స్ తేదీలను ఏపీపీఎస్సీ ఇంకా ఖరారు చేయలేదు.

జేఈఈ మెయిన్ 2024 తొలి విడత పేపర్ 2 ఫలితాలు విడుదల.. ఫలితాలు ఇక్కడ చెక్‌ చేసుకోండి

దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లోని బీ.ఆర్క్ లేదా బీ.ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ 2024 మొదటి దశ పరీక్ష పేపర్-2 ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మార్చి7న విడుదల చేసింది. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.