Hyderabad: ఐటీఐ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వంతో టాటా టెక్నాలజీస్ ఒప్పందం
రాష్ట్రంలోని 65 ఐటీఐలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల (స్కిల్లింగ్ సెంటర్లు) ఏర్పాటుకు టాటా గ్రూప్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సంబంధిత ఎంవోయూ పత్రాలపై అధికారులు సంతకాలు చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేయనున్న టాటా టెక్నాలజీస్ లిమిటెడ్...
ఐటీఐ విద్యార్థులకు శుభవార్త. ఐటీఐ కోర్సుల రూపు రేఖలు మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని 65 ఐటీఐలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల (స్కిల్లింగ్ సెంటర్లు) ఏర్పాటుకు టాటా గ్రూప్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సంబంధిత ఎంవోయూ పత్రాలపై అధికారులు సంతకాలు చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేయనున్న టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (TTL). ప్రభుత్వ భాగస్వామ్యంతో టాటా టెక్నాలజీస్ ఈ కొత్త ప్రాజెక్టును చేపడుతోంది.
9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులతో పాటు నైపుణ్యాల మధ్య అంతరాన్ని తగ్గించే బ్రిడ్జి కోర్సులను నిర్వహించనున్నారు. ఐటీఐ కోర్సుల రూపురేఖలు మార్చే దిశగా ముందడుగు వేసిన ప్రభుత్వం.. 2024-25 విద్యాసంవత్సరం నుంచే ప్రాజెక్టు అమలుకు సన్నాహాలు చేస్తోంది. 2024-25 విద్య సంవత్సరం నుంచే ఇంజనీరింగ్ కోర్స్‌లకు ధీటుగా ఐటిఐ కోర్సులను మార్చనున్నారు.
ఇదిలా ఉంటే ఐటీఐలలో సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి ఈ ఏడాది ప్రారంభంలో టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమైన విషయం తెలిసిందే. ఇక కోర్సుల నిర్వహణకు అవసరమైన యంత్రాలు, సాఫ్ట్‌వేర్‌ను అందించడంతో పాటు ప్రతీ ఐటీఐలో ఇద్దరు మాస్టర్ ట్రెయినర్లను టాటా సంస్థ అందించనుంది. ఈ ప్రాజెక్టును ఐదేళ్ల పాటు టాటా సంస్థ ఉచితంగా అందించనుంది. తొలుత 50 ప్రభుత్వ ఐటీఐల్లో కోర్సును అందించాలనుకున్నారు కానీ, ప్రస్తుతం ఈ సంఖ్యను 65కి పెంచారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..