AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: సుందరమైన వ్యూ కలిగిన ఫ్లై ఓవర్‎ను ప్రారంభించిన సీఎం రేవంత్..

హైదరాబాద్ మెడలో మరో మణిహారాన్ని బైరామల్ గూడ ఫ్లైఓవర్‎తో అలంకరించబోతున్నారు. ఈ ఫ్లైఓవర్ 780 మీటర్ల పొడవుగా విస్తరించి ఉందని చెబుతున్నారు అధికారులు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డిపి)లో భాగంగా బైరామల్‌గూడ జంక్షన్‌లో కొత్త ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ ఫ్లైఓవర్, ఎల్ బి నగర్ పరిధిలో నిర్మించేందుకు చేపట్టిన ప్రణాళికల్లో ఒకటి. మొత్తం 14 నిర్మాణాలలో ఈ ఫ్లైఓవర్ ఆరవది.

Watch Video: సుందరమైన వ్యూ కలిగిన ఫ్లై ఓవర్‎ను ప్రారంభించిన సీఎం రేవంత్..
Biramal Guda Flyover
Srikar T
|

Updated on: Mar 09, 2024 | 8:02 PM

Share

హైదరాబాద్ మెడలో మరో మణిహారాన్ని బైరామల్ గూడ ఫ్లైఓవర్‎తో అలంకరించబోతున్నారు. ఈ ఫ్లైఓవర్ 780 మీటర్ల పొడవుగా విస్తరించి ఉందని చెబుతున్నారు అధికారులు. దీనిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన చేతుల మీదుగా ప్రారంభించారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డిపి)లో భాగంగా బైరామల్‌గూడ జంక్షన్‌లో కొత్త ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ ఫ్లైఓవర్, ఎల్ బి నగర్ పరిధిలో నిర్మించేందుకు చేపట్టిన ప్రణాళికల్లో ఒకటి. మొత్తం 14 నిర్మాణాలలో ఈ ఫ్లైఓవర్ ఆరవది. దీని నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ఖర్చులతో పాటు ఇతర వ్యయాలు కలుపుకొని రూ. 448 కోట్లతో చేపట్టారు. హైదరాబాద్ రమణీయమైన ప్రకృతి దృశ్యాన్ని, సీనరీలను చూసేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. ఈ ఫ్లైఓవర్ 780 మీటర్ల పొడవును కలిగి ఉంది.

భారతదేశంలోనే మొట్టమొదటి ప్రీకాస్ట్ అండ్ పోస్ట్-టెన్షన్డ్ టెక్నాలజీ తో నిర్మించిన గొప్పకట్టడంగా చెబుతున్నారు అధికారులు. ఈ వినూత్న నిర్మాణంలో అనేక అధునాతనమైన సాంకేతికతలను ఉపయోగించినట్లు చెబుతున్నారు. ఈ ఫ్లైఓవర్ సికింద్రాబాద్ నుండి ఒవైసీ జంక్షన్ వరకు ట్రాఫిక్ సమస్యలను గణనీయంగా తగ్గించి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది. బైరామల్ గూడ జంక్షన్ వద్ద 95%, సాగర్ రోడ్ జంక్షన్ వద్ద 43% ట్రాఫిక్ సమస్యలకు చక్కని పరిష్కారాన్ని అందిస్తుంది. దీని నిర్మాణ సమయంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ఈ ఫ్లైఓవర్ నిర్మించే క్రమంలో ఒకచోట సమస్య తలెత్తి కూలిపోయి కార్మికులకు స్వల్ప గాయాలైనప్పటికీ విజయవంతంగా పూర్తిస్థాయిలో నిర్మించారు. ఈ కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే.. హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న పట్టణాల జాబితాలో సుస్థిరమైన చోటు సంపాధించుకోవడానికి మార్గం సుగమం చేస్తుందని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
FDపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్‌ ఇదే..!
FDపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్‌ ఇదే..!
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ