Medak Politics: మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ నేతల మౌనం.. కార్యకర్తల్లో ఆందోళన
ఓ వైపు లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ సమయంలో నాయకులు ఎంత అలర్ట్‌గా ఉంటారు. కానీ ఆ పార్లమెంట్ పరిధిలో మాత్రం, ఓ పార్టీ నేతలు అందరూ ఓకేసారి సైలెంట్ అయ్యారు. గతంలో కొంత హడవుడి చేసిన నాయకులు ఇప్పుడు ఉలుకు, పలుకు లేకుండా చాలా సైలెంట్‌గా ఉంటుడడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో టెన్షన్ పెరిగిపోతుందట. ఇంతకీ ఆ నాయకులు ఎవరు...? ఇదంతా ఏ పార్లమెంట్ పరిధిలో అంటున్నారా..?
ఓ వైపు లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ సమయంలో నాయకులు ఎంత అలర్ట్‌గా ఉంటారు. కానీ ఆ పార్లమెంట్ పరిధిలో మాత్రం, ఓ పార్టీ నేతలు అందరూ ఓకేసారి సైలెంట్ అయ్యారు. గతంలో కొంత హడవుడి చేసిన నాయకులు ఇప్పుడు ఉలుకు, పలుకు లేకుండా చాలా సైలెంట్‌గా ఉంటుడడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో టెన్షన్ పెరిగిపోతుందట. ఇంతకీ ఆ నాయకులు ఎవరు…? ఇదంతా ఏ పార్లమెంట్ పరిధిలో అంటున్నారా..? చదవండి ఈ స్టోరీ..!
మెదక్ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ డీలా పడిపోయినట్లు కనిపింస్తుందట. రాష్ట్రం ఏర్పాటు అయ్యాక 10 సంవత్సరాల తర్వాత స్వరాష్ట్రంలో అధికారం దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ.. కానీ ఆ ఉత్సాహం మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న కాంగ్రెస్ నేతల్లో ఏ మాత్రం కనపడడం లేదట. ఎంపీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మిగతా పార్టీల నేతలు మెదక్ పార్లమెంట్ పరిధిలో ఎదో ఒక కార్యక్రమం చేస్తూ, నిత్యం జనాల్లో ఉండే ప్రయత్నాలు చేస్తుంటే, ఇక్కడి కాంగ్రెస్ నేతలు మాత్రం ఎంపీ ఎన్నికలే కాదా చూద్దాంలే అని లైట్ తీసుకుంటన్నారట. మెదక్ పార్లమెంటు పరిధిలోని కాంగ్రెస్ నేతలు అందరూ ఒకేసారి సైలెంట్ అవ్వడం, ఇప్పుడు లోక్ సభ నియోజకవర్గం పరిధిలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
మెదక్ ఎంపీ టికెట్ కావాలని సీనియర్ నేతలు జగ్గారెడ్డి, మైనంపల్లి హన్మంతరావు లాంటి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. ఈ నేతలు కూడా మొన్నటి వరకు ఎదో ఒక పేరుతో మెదక్ పార్లమెంట్ పరిధిలోకి వెళ్లడం, మీడియాలో ఉండడం లాంటివి చేశారు. కానీ సడన్‌గా ఏమైందో తెలియదు కానీ, అందరూ సైలెంట్ అయ్యారు. మైనంపల్లి హన్మంతరావు గతంలో కొంత హంగామా చేసినా, ఇప్పుడు అది కూడా లేదట. వీళ్ల వ్యవహార శైలి చూస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలకు టెన్షన్ పట్టుకుందట. ఓ వైపు రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీలో ఉండి మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న సీనియర్ లీడర్లు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు అనేది అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారట.
మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంతే. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా మెదక్ పార్లమెంట్ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా, అందులో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది కేవలం ఒక్క సీట్ మాత్రమే. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇక్కడ ఉన్న కార్యకర్తలు నూతనోత్సాహంతో పనిచేయాలని తహతహలాడు తున్నారట. కానీ మమ్మల్ని ముందుకు నడిపే నాయకులు ఇలా మౌనంగా ఉంటే ఎలా అని చాలామంది కార్యకర్తలు నాయకులపై కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారట.
ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇతర పార్టీల నేతలు జిల్లాలోనే ఉంటూ.. కార్యకర్తలకు పలు సూచనలు చేస్తూ, నిత్యం జనాల్లో ఉంటుంటే, కాంగ్రెస్ నేతలు మాత్రం వారి కార్యకర్తలకు కూడా సరిగ్గా అందుబాటులోకి రావడం లేదట. ఒక వేళ ఈ నేతలకు ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యం లేకపోయినా పార్టీ కోసం, అభ్యర్థి గెలుపు కోసం పాటుపడల్సిన అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని తమ నాయకులు మరిచిపోయినట్లు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారట. మరో మూడు రోజుల్లో ఎంపీ ఎన్నికల్లో కోడ్ వచ్చే అవకాశం ఉందని, ఇకనైనా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న కాంగ్రెస్ నేతల తీరు మారాలని, లేకపోతే ఆ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…